Tribute | తలశిల చంద్రశేఖర్‌రావు భౌతిక కాయానికి వైయస్ జగన్ నివాళి

Tribute | తలశిల చంద్రశేఖర్‌రావు భౌతిక కాయానికి వైయస్ జగన్ నివాళి

Tribute | విజయవాడ రూరల్, ఆంధ్రప్రభః వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ తండ్రి తలశిల చంద్రశేఖర్‌రావు (88) మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ గొల్లపూడిలోని తలశిల రఘురామ్ నివాసానికి చేరుకుని, చంద్రశేఖర్‌రావు భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. చంద్రశేఖర్‌రావు మరణం తలశిల రఘురామ్ కి, వారి కుటుంబ సభ్యులకు తీరని లోటని వైయస్ జగన్ పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో తలశిల రఘురామ్ కి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, చంద్రశేఖర్‌రావు ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు వైయస్ జగన్ తెలిపారు.

Leave a Reply