ఆ నాయకుడిపై ఫిర్యాదుకు సిద్ధం..

చెన్నూర్, ఆంధ్రప్రభ : గత కొద్దిరోజుల క్రితం జరిగిన చెన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో స్వంత పార్టీలో ఉంటూ అదే పార్టీ అభ్యర్థుల ఓటమి చవిచూసేందుకు కోవర్టు రాజకీయం చేసిన బడా నాయకుల పై పార్టీ వేటు పడుతుందా అనే ప్రశ్న అధికార కాంగ్రెస్ పార్టీలో మొదలైనట్లు కన్పిస్తుంది. జరిగిన ఎన్నికలలో ప్రధాన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు రెబల్ గా వేసిన అభ్యర్థులను మంత్రి వివేక్ ఆదేశాల అనుసారం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు నిన్న క్యాంప్ కార్యాలయా సమావేశంలో ప్రకటించిన విషయం విదితమే.

అదే సమయంలో నూతనంగా ఎన్నికైన ఇద్దరు కౌన్సిలర్లు తమ ఓటమి చవిచూసేందుకు కోవర్టు రాజకీయం చేస్తూ అంతర్గత ప్రయత్నాలు చేశారని ఆరోపిస్తూ ఓ నాయకున్ని పార్టీ నాయకులముందు నిలదీసినట్లు సమాచారం. రెబల్ గా వేసిన అభ్యర్థులు బహిర్గతంగానే ప్రచారాలు చేసుకున్న, కోవర్టు నాయకుడు చేసింది పార్టీ ద్రోహంగా చెబుతూ ఆ నాయకున్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం.

Leave a Reply