Rs.1.46 cr | దారుణ స్థితిలో ఆరోగ్య కేంద్రాలు

Rs.1.46 cr | దారుణ స్థితిలో ఆరోగ్య కేంద్రాలు
Rs.1.46 cr | గుడివాడ – ఆంధ్రప్రభ : గుడివాడలో ఆరోగ్య కేంద్రాలు దారుణ స్థితిలో ఉన్నాయని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. నియోజకవర్గంలోని ఆరోగ్య కేంద్రాల దుస్థితినీ అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చారు. గత ప్రభుత్వా నిర్లక్ష్య ధోరణితో అస్తవ్యస్తంగా పిహెచ్‌సీలు ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఆరోగ్య వ్యవస్థను పరిశీలిస్తుంటే విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో పారదర్శకంగా వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గుడివాడలోని వంద పడకల ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.
ఎమ్మెల్యే రాము ప్రశ్నలకు మంత్రి సత్య కుమార్ సమాధానం ఇచ్చారు. అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో ఎమ్మెల్యే రాము తెలిపారు. గత ప్రభుత్వంలో నిర్విర్యమైన వ్యవస్థల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ల వ్యవస్థ ఒకటి అన్నారు. రాష్ట్రంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ల పరిస్థితి దారుణమైన పరిస్థితిలో ఉందన్నారు. గత పాలకులు హెల్త్ సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపనలైతే చేశారు కానీ…వాటిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గుడివాడ పట్టణంలో ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు మంజూరు అయ్యాయన్నారు. అయితే బాపూజీ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ ఒక్కటి మాత్రమే నిర్మాణం పూర్తి తీసుకుందన్నారు. పురపాల సంఘ నిధులతో బేతవోలు హెల్త్ సెంటర్ ను అభివృద్ధి చేశామన్నారు.
పునాది దశలో, నిర్మాణ దశలో ఉన్న ధనియాల పేటలో, స్లేటర్ పేట హెల్త్ సెంటర్ల భవన ఫోటోలను అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వ్యయం పెరిగి నాడు మంజూరైన రూ.80లక్షల నిధులు నేడు సరిపోవటం లేదన్నారు. గుడివాడలో భవన నిర్మాణాలకు అవసరమైన రూ.1.46 కోట్లు మంజూరు చేయాలని మంత్రివర్యులకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. నందివాడ మండలం రుద్రపాకలో ఉన్న 30 పడగల ఆసుపత్రికి పిహెచ్సి నిధులు మంజూరు చేశారని, భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసి రుద్రపాకలో 30 పడకల సిహెచ్సి అభివృద్ధి చేయాలన్నారు. రామాపురం, మోటూరు, కౌతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాలు శిధిలావస్థకు చేరుకొని దారుణ స్థితిలో ఉన్నాయన్నారు.
