T20 World Cup | ఆస్ట్రేలియా ఔట్..

T20 World Cup | ఆస్ట్రేలియా ఔట్..
- సూపర్ 8కు జింబాబ్వే
T20 World Cup | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఈ రోజు టీ20 వరల్డ్ కప్‌లో ఐర్లాండ్, జింబాబ్వే జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ వర్షం వల్ల మ్యాచ్‌ను కొనసాగించలేకపోయారు, కాబట్టి రెండు జట్లకు ఒకొక్క పాయింట్‌ను కేటాయించారు. ఇది మ్యాచ్‌కు సంబంధించిన అభిమానం, ఉత్కంఠను కొంత తగ్గించినప్పటికీ, ఇరు జట్లకు తమ ప్రస్థానంలో పోటీలో ఉండేందుకు అవకాశం కల్పించింది.
టీ20 వరల్డ్ కప్‌లో ఐర్లాండ్, జింబాబ్వే మధ్య ఇవాళ జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. దీంతో గ్రూప్-బీ నుంచి జింబాబ్వే సూపర్ 8 బెర్తు ఖరారు చేసుకుంది. ఈ పరిణామంతో సూపర్ 8 విషయంలో ఆస్ట్రేలియా ఆశలు గల్లంతయ్యాయి. గ్రూప్-బీ నుంచి ఇప్పటికే శ్రీలంక సూపర్ 8కి వెళ్లింది.
ఇక గ్రూప్-బి తదుపరి నామమాత్రపు మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆఖరిగా శుక్రవారం నాటి మ్యాచ్ లో ఒమన్ తో తలపడుతుంది. మరోవైపు జింబాబ్వే గురువారం శ్రీలంకను ఢీకొడుతుంది. ఇదిలా ఉంటే.. గ్రూప్-ఎ నుంచి టీమిండియా సూపర్-8కు చేరగా.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే.. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్.. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ అర్హత సాధించాయి. ఆఖరి బెర్తు కోసం గ్రూప్-ఎ నుంచి పాకిస్తాన్, అమెరికా బరిలో ఉన్నాయి. కాగా గత వరల్డ్కప్ ఎడిషన్ లో పాక్ ను వెనక్కి నెట్టి అమెరికా సూపర్-8కు చేరిన విషయం తెలిసిందే.
