గజ్వేల్ లో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

గజ్వేల్, ఆంధ్రప్రభ ; తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ శాసనసభ్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు మంగళవారం గజ్వేల్ లో ఘనంగా నిర్వహించారు. కేసరి హనుమాన్ దేవాలయంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, బీ ఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్మన్ కళ్యాణ్ కర్ పద్మాబాయి నర్సింగరావులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల అభిమానుల సందడి గజ్వేల్ నియోజకవర్గంలోని మార్కుక్ మండలం ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద ఉదయం నుండి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకొని సందడి చేశారు. కేసీఆర్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. మధ్యాహ్నం తర్వాత ఫామ్ హౌస్ లోకి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అనుమతినిచ్చారు.

Leave a Reply