Ap Cm CBN : వనరులు ఓకే Andhra Ptabha Spot News

Ap Cm CBN : వనరులు ఓకే Andhra Ptabha Spot News
ఇక సంపద సృష్టే ఆలస్యం
10 సూత్రాలతో స్వర్ణాంధ్ర
మైక్రోసాప్ట్ రాకతో అభివృద్ధికి దోహద
బిల్ గేట్స్ భేటీలో ఏపీ సీఎం పవర్ ప్రజంటేషన్
( ఆంధ్రప్రభ, వెలగపూడి ప్రతినిధి)

ఏపీలో అన్ని వనరులు ఉన్నాయి, ఇప్పుడు సంపద సృష్టి జరగాలి. బిల్ గేట్స్ సహకారంతో వివిధ రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తాం. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నాం, అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మెక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ అమరావతి పర్యటన సందర్భంగా సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర విజన్ 2047, ప్రభుత్వ పాలసీలు, లక్ష్యాలు, కార్యక్రమాలపై బిల్ గేట్స్‌కు సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దశ-దిశ ఏర్పాడుతుంని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బిల్ గేట్స్‌తో తన అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. 1997లో తొలి సారి తాను బిల్ గేట్స్‌ను కలిసిన సంగతి, హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు జరిగిన తీరును గేట్స్ సమక్షంలో సీఎం గుర్తు చేశారు.

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలను ఆయన వివరించారు. ఏపీలోని వివిధ ప్రాజెక్టులకు గేట్స్ ఫౌండేషన్ అందిస్తున్న సహకారంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. వైద్యరంగంలో తెచ్చిన మార్పులు -సాధించిన ఫలితాలపైనా ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ అమరావతి పర్యటన చారిత్రాత్మకం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ పర్యటన దోహదం చేస్తుంది, అని ఆశాభావం వ్యక్తం చేశారు. నాడు మైక్రోసాఫ్ట్ రాకతో ఐటీ రంగంలో హైదరాబాద్ మేటిగా నిలబడింది అన్నారు.
స్పీడ్ గవర్నెన్ప్ లక్ష్యం

స్పీడ్ ఆఫ్ డెలివరిం గ్ గవర్నెన్స్ అనేది ఏపీ ప్రభుత్వ విధానం. ఇందుకు టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తున్నాం. అమరావతి డిజైన్ అండ్ ఫౌండ్రీ, క్వాంటం వ్యాలీగా ఆవిష్కృతం అవుతుంది. డేటా- ఏఐ సిటీగా విశాఖ, గ్రీ న్ హైడ్రోజన్ వ్యాలీగా కాకినాడ, డ్రోన్ సిటీగా ఓర్వకల్లును తీర్చిదిద్దుతున్నాం. ఎలక్ట్రానిక్స్- ఏరో సిటీగా లేపాక్షి, ఎలక్ట్రానిక్స్-స్పేస్ సిటీగా తిరుపతిని అభివృద్ధి చేస్తున్నాం, అని సీఎం చంద్రబాబు వివరించారు.
ఏఐ మా అస్త్రం

రాష్ట్రంలో మొత్తం 10 రంగాలు, 30 ప్రభుత్వ విభాగాల్లో ఏఐని వినియోగిస్తున్నాం. విద్యారంగంలో అధునిక విధానాలను పాటిస్తున్నాం. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా బోధనలో మార్పులు చేస్తున్నాం. వ్యవసాయం, అనుబంధ రంగాలను బలోపేతం చేస్తున్నాం. రైతు సంక్షేమం కోసం సాంకేతిక సాయం తీసుకుంటున్నాం. మెరుగైన ప్రజారోగ్య సేవలు అందించేందుకు అత్యున్నత స్థాయి నిపుణులతో సలహా మండలి ఏర్పాటు చేశాం. యూనివర్శల్ హెల్త్ స్క్రీనింగ్ విధానం ప్రజలకు ముందస్తుగానే మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం, సీఎం చంద్రబాబు తన ప్రజంటేషన్ లో సవివరంగా తెలిపారు.
ఔను భారత్ లో డిజిటాల్ విప్లవం : బిల్ గేట్స్

ఈ సమావేశంలో పలు అంశాలపై సెక్రటేరీయేట్లోని సమావేశ మందిరంలో సీఎం, మంత్రులు, సెక్రటరీలతో మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. చంద్రబాబు తనకు గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ అని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశంలో ఇన్నోవేషన్స్, వేగవంతమైన నిర్ణయాలు, చర్యలు అద్భుతంగా ఉన్నాయని బిల్ గేట్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. డిజిటల్ విప్లవానికి భారతదేశంలో బలమైన పునాదులు పడ్డాయన్నారు. భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని బిల్ గేట్స్ కితాబు ఇచ్చారు.

తాను మొదటిసారి సీఎం చంద్రబాబును కలిసినప్పటి విషయాలను ఈ సమావేశంలో ఆయన గుర్తు చేశారు. ప్రపంచ దేశాల్లో తాను కలిసిన ఎంతో మంది నాయకుల ఆలోచనల కంటే చంద్రబాబు ఆలోచనలు చాలా ముందున్నాయని తొలి భేటీలోనే తాను గ్రహించానని బిల్ గేట్స్ తెలిపారు. నాటి సింగపూర్ ప్రధాని కూడా చంద్రబాబు తరహా భిన్నమైన, విజన్‌తో కూడిన ఆలోచనలు చేసేవారని బిల్ గేట్స్ వివరించారు. గేట్స్ ఫౌండేషన్ ఆరోగ్య రంగానికి ప్రాధాన్యం ఇస్తోందని, ఈ ప్రాజెక్టులే మెజార్టీ ప్రాజెక్టులని ఆయన వివరించారు. ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలి, కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందని బిల్ గేట్స్ ప్రశంసించారు. విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకోవడానికి… వారికి సరైన రీతిలో… తగిన స్థాయిలో విద్యా బోధన చేయడానికి AI సహయపడుతుందని వివరించారు. విద్యారంగంలో అద్భుతమైన మార్పులు తీసుకురావడానికి ఏఐ- టెక్నాలజీ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.

వ్యవసాయం రంగ చాలా ముఖ్యమైన రంగమని చ ఈ రంగం ఎంత ముఖ్యమో ఇప్పటికీ చాలా మందికి తెలియదని బిల్ గేట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీ సాయంతో ఏపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించడాన్ని బిల్ గేట్స్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. టెక్నాలజీని రైతులకు అందించేందుకు… ఏఐను వ్యవసాయంతో ఇంటిగ్రేట్ చేసేందుకు ఏపీ కృషి చేస్తోందని బిల్ గేట్స్ అభినందించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వ్యవసాయంలో AI టెక్నాలజీని వినియోగంచడం లేదని… కానీ ఆంధ్రప్రదేశ్ దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తుండం మంచి పరిణామమని ఆయన వెల్లడించారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ కోసం టెక్నాలజీతో ముందస్తు అంచనాలతో ప్రాణ నష్టం జరగ్గకుండా జాగ్రత్తలు తీసుకునే వ్యవస్థ ఏర్పాటు కావడం బాగుందని బిల్ గేట్స్ అభినందించారు.

డిజిటల్ గవర్నెన్స్ అనే ఆలోచనను ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పడానికి తాను ప్రయత్నిస్తున్న సమయంలో సీఎం చంద్రబాబు దాని గురించి ఆలోచన చేయడమే కాకుండా… అమలు చేశారని బిల్ గేట్స్ ప్రశంసించారు, డ్రోన్లతో వివిధ రకాల సేవలు వినియోగించుకునే ఆలోచన అద్భుతంగా ఉంది, మలేరియా, అనీమియా జబ్బుల నివారణ కో సం అందరం కలిసి పని చేయాలని బిల్ గేట్స్ సూచించారు.

సమావేశంలో పలు అంశాల పై బిల్ గేట్స్ కు మంత్రులు పయ్యావుల కేశవ్ , సత్యకుమార్ యాదవ్ ప్రశ్నలు వేసి ఆయన అభిప్రాయాలు తెలుసుకున్నారు. హైదరాబాద్‌లో మైక్రో సాఫ్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ఆలోచనకు కారణమేంటని పయ్యావుల ప్రశ్నించగా దీనికి బిల్‌గేట్స్ ఆసక్తికర సమాధానం చెబుతూ, నాడు చంద్రబాబు ఐటీని ప్రమోట్ చేయడం వల్ల టెక్ నిపుణులు చాలా మంది హైదరాబాద్ నుంచే వచ్చేవారని బిల్ గేట్స్. చెప్పారు. అదే సమయంలో చంద్రబాబు మైక్రో సాఫ్ట్ కార్యాలయాన్ని హైదరాబాద్ లో పెట్టాలనే ప్రతిపాదన పెట్టారని దీనిపై తమ వద్ద పని చేసే టెకీల అభిప్రాయం కోరితే… హైదరాబాద్ సెంటర్ ఏర్పాటు చేస్తే తాము వెళ్లడానికి సిద్దంగా ఉన్నట్టు చెప్పారని బిల్ గేట్స్ వివరించారు. ఇప్పుడు కూడా భారతదేశంలో మైక్రో సాఫ్ట్ కంపెనీల్లో పని చేసే చాలా మంది ఉద్యోగుల్లో హైదరాబాద్ నిపుణులే ఎక్కువగా ఉన్నారని బిల్ గేట్స్ వివరించారు.
ఫోటో గ్యాలరీ (Photo Gallery)





ALSO READ : Bill Gates Appraciaton : వెరీ గుడ్..గ్రేట్ వర్క్ Andhra Prabha Spot News
