Deputy CM | డిప్యూటీ సీఎం మల్లు భట్టి ఆశీస్సులు …

Deputy CM | డిప్యూటీ సీఎం మల్లు భట్టి ఆశీస్సులు …

  • డిప్యూటీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ దంపతులు..

Deputy CM | వైరా, ఆంధ్రప్రభ : వైరా మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన డాక్టర్ కాపా చంద్రకళ మొట్టమొదటిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆశీస్సులు కోసం మధిర క్యాంప్ ఆఫీసుకు తరలి వెళ్లారు.. డిప్యూటీ సీఎం కలిసి డాక్టర్ కాపా మురళీకృష్ణ డాక్టర్ కాప చంద్రకళ దంపతులు ఆయన ఆశీస్సులు తీసుకున్నారు… వైరా ను మోడల్ సిటీగా తీర్చిదిద్దే బాధ్యత నాదేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపినట్లు వారు పేర్కొన్నారు …

మున్సిపాలిటీ చైర్మన్గా వైరా మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో.. లైన్స్ క్లబ్ లో అత్యున్నత స్థానమైన గవర్నర్ స్థానానికి ఎన్నికై ఎంతో ఉత్తమ సేవలు అందించిన డాక్టర్ మురళీకృష్ణ సహకారాన్ని పూర్తిస్థాయిలో తీసుకోవాలని డాక్టర్ మురళీకృష్ణ మున్సిపల్ చైర్మన్ కాపా చంద్రకళకు మల్లు భట్టి విక్రమార్క సూచించారు… కనీ విని ఎరుగని రీతిలో వైరా మున్సిపాలిటీని రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల కన్నా గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చే విధంగా అభివృద్ధి జరగాలని దానికి తాను పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నట్లు డాక్టర్ చంద్రకళ తెలిపారు. వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ మాజీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ దుర్గాప్రసాద్,. డాక్టర్ కాపా మురళీకృష్ణ, లగడపాటి ప్రభాకర్ తదితరులు డిప్యూటీ సీఎంను కలిశారు..

click here to read more : Congress | నిముష నిముషానికి మారుతున్న రాజకీయం

click here to read more

Leave a Reply