MLAs Defection | కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు
హైదరాబాద్: కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు పంపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ ఆధారంగా శాసన కార్యదర్శి నరసింహాచార్యులు మంగళవారం నోటీసులు పంపించారు. అయితే వివరణ ఇచ్చేందుకు తమకు సమయం కావాలంటూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కోరారు.