Shivatri | ఊట్కూర్ లో ఘనంగా మహా శివ రాత్రి వేడుకలు..

Shivatri | ఊట్కూర్ లో ఘనంగా మహా శివ రాత్రి వేడుకలు..
Shivatri |ఊట్కూర్, ఆంధ్ర ప్రభ: ఊట్కూర్ లో ఘనంగా మహా శివ రాత్రి వేడుకలు.. ఊట్కూర్, ఆంధ్రప్రభః నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో మహా శివ రాత్రి వేడుకలు భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ కర్ణాటక సరిహద్దులో వెలసిన శ్రీ ఇడ్లురు శంకర్ లింగేశ్వర స్వామి, ఊట్కూర్ చెరువు కట్ట వద్ద ఉన్న శివాలయం దగ్గర రుద్రాభిషేకం ఊట్కూర్ వీరభద్రేశ్వర స్వామి, ఈశ్వర్ మందిర్, గ్రామ పంచాయతీ వద్ద శివాలయం, దంతాన్ పల్లి మూగ బసవేశ్వర స్వామి నిడుగుర్తి గుట్టపై శివాలయం, పులిమామిడి గుట్టపై రామలింగేశ్వర స్వామి పెద్దజట్రం శివాలయం, చిన్నపోర్ల, కొల్లూరు, తిప్రాస్ పల్లి, మల్లేపల్లి, ఓబులాపూర్ పగిడిమర్రి తదితర గ్రామాల్లోని శివాలయాల్లో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మహా శివరాత్రి పర్వదినం వేడుకల్లో భాగంగా శివాలయాలు వేకువ జామున నుండి భక్తులతో కిటకిట లాడాయి. పరమ శివుడి ఆశీస్సుల కోసం భక్తులు ఉపవాస దీక్షలతో ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా శివాలయాల వద్ద భక్తులు శివనామ స్మరణం స్మరించడంతో పల్లెలు శివ నామస్మరణతో మార్మోగాయి.
