Excitement | మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ గా గడ్డం స్వప్న సోమనర్సయ్య..!

Excitement | మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ గా గడ్డం స్వప్న సోమనర్సయ్య..!
దాదాపు గా ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం
వైస్ చైర్మన్ పై ఉత్కంఠ..?
ఎమ్మెల్యే సామెల్ ను కలిసిన గాంధీ నగర్ ఎస్సి లు,ఆర్యవైశ్య ప్రతినిధులు..!
Excitement | మోత్కూర్,ఆంధ్రప్రభః మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ గా 6 వ వార్డ్ కాంగ్రెస్ కౌన్సిలర్ గడ్డం స్వప్న సోమనర్సయ్య ను కాంగ్రెస్ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో నికార్సైన కార్యకర్తగా కొనసాగుతున్న సోమనర్సయ్య కే చైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. గతంలో కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓటమి పాలైన అనంతరం నగేష్ బి ఆర్ ఎస్ లో చేరడం,ప్రమీల సైతం బి ఆర్ ఎస్ లోకి చేరి తిరిగి కాంగ్రెస్ లోకి రావడం మైనస్ పాయింట్ గా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. 2,12 వ వార్డ్ ఎస్సి కౌన్సిలర్లు రమణ నగేష్,ప్రమీల రాములు లు సైతం తమకు చైర్మన్ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే మందుల సామెల్ నివాసానికి తమ తమ మద్దతు దారులను పంపినప్పటికి ..పి సి సి నిర్ణయం మేరకు చైర్మన్ ,వైస్ ఛైర్మన్ అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఎమ్మెల్యే స్వయంగా చెప్పినట్లు తెలిసింది. దీంతో పార్టీకి కట్టుబడి ఉన్న స్వప్న సోమనర్సయ్య లకు అధిష్టానం చైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు సమాచారం.
వైస్ చైర్మన్ పదవి కై ఉత్కంఠ..?
మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం రేసులో 1,9,11 వార్డు కౌన్సిలర్లు పల్లెర్ల వెంకన్న,బీసు శ్రీకాంత్ గౌడ్ ,కారుపోతుల వెంకన్న లు ఉన్నారు. కానీ పల్లెర్ల వెంకన్న,బీసు శ్రీకాంత్ గౌడ్ లు వైస్ చైర్మన్ కోసం పట్టు పడుతుండడంతో అధిష్టానం ఎవరికి వైస్ పదవి ఇస్తుందోనని వారిలో ఉత్కంఠ నెలకొంది.గతంలో బి సి లకు వైస్ చైర్మన్ పదవి ఇవ్వడంతో ఈ దఫా జనరల్ కోటలో కౌన్సిలర్ గా ఎన్నికైన పల్లెర్ల వెంకన్న కు వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని ఆర్యవైశ్య ప్రతినిధులు ఈ రోజు ఎమ్మెల్యే సామెల్ ని స్వయంగా కలిసి విన్నవించినట్లు సమాచారం. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు వైస్ చైర్మన్ ని ఎంపిక చేస్తామని ఎమ్మెల్యే వివరించినట్లు తెలిపారు.
రేపు చైర్మన్, వైస్ ఛైర్మన్ ల ప్రమాణ స్వీకారం…
మోత్కూర్ మున్సిపల్ కార్యాలయంలో రేపు ఉదయం 11 గంటలకు చైర్మన్ ,వైస్ ఛైర్మన్ ఎన్నిక తో పాటు నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఉండడంతో …ఈ రోజు రాత్రి వరకు చైర్మన్, వైస్ చైర్మన్ లను ఖరారు చేసి…రేపు ఉదయం నేరుగా క్యాంప్ నుండి మున్సిపల్ కార్యాలయానికి కాంగ్రెస్ కౌన్సిలర్లు 8 మందిని తరలించనున్నారు.

