వార్డ్ మెంబర్ గా, ఎంపీటీసీగా, ప్రస్తుతం కౌన్సిలర్ గా….

మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపాలిటీ లో ఓ ఎస్సి (మాల) సామాజిక వర్గానికి చెందిన కుర్మిళ్ల ప్రమీల రాములు రాజకీయ ప్రస్థానం ఇలా ప్రారంభం అయ్యింది. వార్డ్ మెంబర్ స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం కౌన్సిలర్ గా గెలుపొందారు.ప్రమీల ఎస్సి సామాజిక వర్గంలో పుట్టినప్పటికీ ఆ రోజుల్లోనే 10 వ తరగతి వరకు చదువుకుంది.పుట్టినిల్లు వలిగొండ మండలం అర్రుర్. ప్రమీల రాములు దంపతులకు ఒక్క కొడుకు,ఇద్దరు కుమార్తెలు. ముగ్గురికి వివాహాలు చేశారు.
నిరుపేద కుటుంబానికి చెందిన వీరు తమకున్న వ్యవసాయ పొలంలో ఇప్పటికీ వరి పంట సాగు చేస్తూనే…3 దశాబ్దాల కు పైగా పోతాయిగడ్డ లోని భువనగిరి రోడ్ లో కేవలం ఒక డబ్బా కొట్టు రోడ్డు పక్కన పెట్టుకొని చికెన్ సెంటర్ నిర్వహిస్తు ప్రజలందరితో సౌమ్యులుగా ఉంటున్నారు. టి డి పి పార్టీ లో కొనసాగిన వీరికి పంచాయతీ వార్డ్ మెంబర్ అవకాశం రావడంతో టి డి పి తరపున పోటీ చేసి గెలుపొందారు.తదనంతరం కాంగ్రెస్ పార్టీలో కొనసాగగా…ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రమీల రాములు ఎంపీటీసీ గా గెలిచారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ ని వీడి బి ఆర్ ఎస్ లో చేరారు.
2020 మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల లో బి ఆర్ ఎస్ పార్టీ 2 వ వార్డులో తనకు పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో బి ఆర్ ఎస్ రెబల్ గా పోటీ చేయగా ఓడి పోయారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేశారు.ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో 2 వ వార్డ్ నుండి పార్టీ టిక్కెట్ ఇవ్వడంతో సమీప బి ఆర్ ఎస్ అభ్యర్థి పై 207 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు.ఇలా ఆమె ప్రస్థానం కొనసాగగా…ప్రజాప్రతినిధిగా కొనసాగుతూనే ..తమ వ్యాపార రంగంలో చికెన్ కొడుతూ.. తమ స్వంత వ్యవసాయ పొలంలో నాట్లు వేస్తూ ఓ సాధారణ మహిళగా కొనసాగారు తప్ప ఆడంబరాలకు పోలేదని పలువురు అభిప్రాయ పడ్డారు.
మున్సిపల్ చైర్మన్ పదవి వచ్చేనా…!
వార్డ్ మెంబర్ గా,ఎంపీటీసీగా ,ప్రస్తుతం కౌన్సిలర్ గా ఇలా వరుసగా ప్రజాప్రతినిదిగా కొనసాగుతున్న ప్రమీల రాములు కు…మున్సిపల్ చైర్మన్ పదవి పీఠం దక్కే అవకాశం ,యోగం ఉందొ ..లేదో ..వేచిచూడాల్సిందే..!
