Huzurnagar | సేవకునికే ప్రజలు పట్టం..

Huzurnagar | సేవకునికే ప్రజలు పట్టం..

14 వార్డ్ లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా గెలిచిన దగ్గుబాటి కవిత బాబురావు
14 వార్డ్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా..

Huzurnagar, ఆంధ్రప్రభ : దగ్గుపాటి బాబురావు పేరు ఒక్క హుజూర్‌నగర్ కే కాదు చాలా ప్రాంతాలకు ఒక మంచి సేవకుడిగా సుపరిచితుడు. నిరుపేద కుటుంబానికి చెందిన వాడైన సమాజ హితం కోరుకునేవాడు. కష్టాల్లో ఉన్న వారికి తన పరిధిలో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా వారికి సహాయం చేయాలనే సంకల్పం ఉన్న వ్యక్తి దగ్గుపాటి బాబురావు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు దగ్గుపాటి సుశీల రాజారావుల పేరు మీద డిఎస్ఆర్ ట్రస్ట్ ను నెలకొల్పి ఆ ట్రస్ట్ ద్వారా ఒక సేవకుడిగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఎంతో మందికి ఆదర్శంగా ఉంటున్నాడు. డీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా రక్తదానం చేస్తూ ఎంతో మందికి తన సైన్యం ద్వారా రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారు.

ఒక వైపు ప్రజా సేవకుడిగా ఉంటూనే తన మాల సామాజిక వర్గాల అభ్యున్నతికి సేవ చేస్తూ, రాజకీయాల్లో రాణిస్తూ హుజూర్‌నగర్ మున్సిపల్ ఎన్నికల్లో 14 వార్డ్ ఎస్సి మహిళ రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్ టికెట్ ఆశించి టికెట్ రాకపోవడం ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బాబురావు తన సతీమణి దగ్గుబాటి కవితను పోటీలో నిలిపారు. ప్రచారంలో ఇంటింటికి తాను చేసిన సేవా కార్యక్రమాలు తన అనుచరులతో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకొని కాంగ్రెస్ బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్ధుల కంటే 193 ఓట్ల మెజారిటీతో దగ్గుబాటి కవిత బాబురావు కౌన్సిలర్ గా గెలిచి నిలిచారు. దగ్గుపాటి కవిత బాబురావు విజయాన్ని పట్టణ ప్రజలు ఒక మంచి సేవకుడికి దక్కిన గుర్తింపుగా చెప్పుకుంటున్నారు. పాలకుడిగా కాకుండా ప్రజా సేవకుడిగా ఉంటూ వార్డ్ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని కౌన్సిలర్ దగ్గుపాటి కవిత బాబురావు ఆంధ్రప్రభకు తెలిపారు.

Leave a Reply