Farmers | మర్రిగూడలో యూరియా కొరత

Farmers | మర్రిగూడలో యూరియా కొరత
- స్లాట్ బుకింగ్ కోసం వచ్చిన రైతులకు నిరాశ
- యూరియా సరఫరాను వేగవంతం చేసి
- ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి
- యూరియా కొరతతో రైతుల్లో ఆందోళన
Farmers | మర్రిగూడ, ఆంధ్రప్రభ : మర్రిగూడ మండల కేంద్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలు పెరుగుదల దశలో ఉండగా సమయానికి యూరియా అందకపోవడం రైతుల్లో ఆందోళనకు కారణమైంది. ఆశతో యూరియా కోసం స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు కేంద్రానికి వచ్చిన పలువురు రైతులకు అధికారులు ఐడి రాలేదని చెప్పడంతో నిరాశతో వెనుతిరిగారు. ఉదయం నుంచే వచ్చి వేచి చూసినా బుకింగ్ జరగకపోవడంతో నిరాశతో తిరిగి వెళ్లాల్సి వస్తుందని వారు తెలిపారు. పంటలకు ఇదే కీలక సమయం. రోజులు వృథా అయితే దిగుబడి తగ్గిపోతుందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. పంటల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని యూరియా సరఫరాను వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయమై మండల వ్యవసాయ అధికారిని ఆంధ్రప్రభ సంప్రదించగా ఐడి శుక్రవారం సాయంత్రానికి వస్తుందని వచ్చిన వెంటనే శనివారం నుంచి స్లాట్ బుకింగ్ ప్రారంభిస్తామని, సరఫరా సమస్య తాత్కాలికమే అని తెలిపారు.
