8th Ward | తొలిసారి ఓటు వేసిన యువతీ యువకులు…

8th Ward | తొలిసారి ఓటు వేసిన యువతీ యువకులు…

8th Ward | మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో తొలిసారిగా యువతీ, యువకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ గొప్పదని.. నీతి నిజాయితీతో పరిపాలన చేసే ప్రజాపతినిధిని ఎన్నుకునేందుకు… మున్సిపల్ ఎన్నికల్లో తాము తొలిసారిగా ఓటు వేయడం సంతోషంగా ఉందని పలువురు యువతీ, యువకులు అభిప్రాయపడ్డారు.

మోత్కూర్ మున్సిపాలిటీలో 8 వ వార్డులో గౌరు సంతోషి , 1 వ వార్డులో ధబ్బేటి వరుణ్ సాయి , 9వ వార్డులో ధబ్బేటి నేహా, నితిన్ లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.

8th Ward |

Leave a Reply