Local war :  వైసీపీ అయ్యోమయం Andhra Prabha Insight Story

Local war :  వైసీపీ అయ్యోమయం Andhra Prabha Insight Story

ప్రతిపక్షం హోదా పేచీ

బూతుల పర్వం

యుద్ధానికి కూటమి సిద్ధం

ఇటు అభివృద్ధి

అటు సంక్షేమం

దూకుడులో రథసారథులు

ఇదీ ఏపీ రాజకీయ విచిత్రం

( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్​  నెట్​ వర్క్​ ప్రతినిధి)

Local war

తాజాగా తెలంగాణలో పల్లె పోరు (Local war) ముగిసింది. ప్రస్తుతం పుర సమరం నడుస్తోంది. అధిరకార పార్టీ పంచాయతీల్లో గెలుపుతో విజయదరహాసంతో దూసుక పోతోంది. ఇది సరే.. తాజాగా ఏపీలోనూ స్థానిక సమర భేరీ మోగింది. ఓట్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలుత పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల ఎన్నికలపై ఏపీలోని కూటమి (NDA) ప్రభుత్వం దృష్టి సారించింది.

Local war

39.17 శాతం వైసీపీ  (YCP) ఓటు బ్యాంకుకు చిల్లు పెట్టే వ్యూహంతో ఎన్డీయే అడుగులు వేస్తోంది. మార్చినెలలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీనీ ఊడ్చివేయటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. తొలుత పట్టణ, నగరాల్లో  వైపీసీని బలహీన పరిస్తే.. ఆ తరువాత గ్రామీణ ప్రాంతాల్లో పడుతుందని కూటమి నేతల అంచనా.  ఇప్పటికే కూటమి రథసారథులు చంద్రబాబు నాయుడు, పవన్​ కళ్యాణ్​ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.

Local war

అభివృద్ధి, సంక్షేమం మంత్రంతో జనంలో దూసుకు పోతున్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు పెంచుకొంటున్నారు. క్వాంటం వ్యాలీ శంకుస్థాపన, అమరావతి పనుల్లో వేగం, పోలవరం జాతికి అంకితం.. ఇలా.. అభివృద్ధి పనుల్లో శర వేగం పెంచారు. సూపర్​ సిక్స్​ పథకాల్లో సక్సెస్​ మంత్రం మార్మోగుతోంది. మెగా డిఎస్పీతో నిరుద్యోగుల్లో హ్యాపీనెస్​.. గ్రామీణ రహదారుల నిర్మాణం..  ఇలా కూటమి నేతలు దూసుకు పోతుంటే..

Local war :   అయ్యోమయంలో వైసీపీ

Local war

ఇక ప్రధాన రాజకీయ పార్టీ అధినేత జగన్​ మోహన్​ రెడ్డి స్థితి గతి  వైసీపీ కేడర్​ కు అంతుబట్టటం లేదు. ఆయన వీధుల్లోకి వస్తే జనసంధ్రం ఎగసి పడుతోంది. ప్రతి సంఘటనలోనూ ఎవరొకని చావు వార్తను పార్టీ కేడర్​ జీర్ణించుకోలేక పోతోంది. ఇక పార్టీ వ్యూహకర్తలందరూ కేసుల్లో ఇరుక్కుని మాట పెగలని స్థితి చేరుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి.. సుబ్బారెడ్డి సహా అధిష్ఠానంలో అగ్రనేతలు స్థానిక సమరంపై తమ తంత్రాంగం ఇంకా విప్పలేదు. పార్టీ అధినేత కూడా పార్టీ కేడర్​ను స్థానిక యుద్ధానికి  సిద్ధం చేయటం లేదు.  

Local war

తప్పుడు కేసులంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు, తమ ప్రభుత్వం వచ్చిన తరువాత రపారపా అడేస్తామని పోలీసులను హెచ్చరించటంతోనే ఆయన నిత్య కృత్యం సరిపోయిందని పార్టీ కేడర్​ గగ్గోలు పెడుతోంది. నిజానికి 2021లో స్థానిక సంస్థల ఎన్నికల్లో.. ప్రతిపక్ష పార్టీని ఊడ్చిపారేసిన వైసీసీ అధినేత.. తాజాగా తనకూ అదేగతి పడుతుందా? అనే అనుమానంతోనే లోకల్​ ఫైట్​ కి కసరత్తు చేయటం లేదనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. గత స్థానిక  ఎన్నికల్లో వైసీపీ జరిపిన జైత్రయాత్రను ఓ సారి పరిశీలిద్దాం.

Local war :  గతమెంతో ఘన కీర్తి

Local war

స్థానిక పోరులో…అధికార రాజకీయ పార్టీ ఏ రీతిలో తన బలగాన్ని ప్రయోగించి క్షేత్రస్థాయిని వశం చేసుకుంటుందో ఓ సారి పరిశీలిద్దాం. కొత్తగా ఏర్పడిన  వైసీపీ ప్రభుత్వం మరో రెండేళ్ల వ్యవధిలోనే క్షేత్ర స్థాయి పునాదులపై దృష్టి సారించింది. 2021 సెస్టెంబర్​ లో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది.

Local war

  మొత్తం 13,000 పైగా పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా,  10,500 కంటే ఎక్కువ (సుమారు 80% పైగా) సర్పంచ్ స్థానాలను వైసీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. ఇందులో  2,000 పైగా పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇక 2,000 నుండి 2,100 వరకు (దాదాపు 16% – 17%) సర్పంచ్ స్థానాలను  టీడీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో సైతం వైసీపీ మద్దతుదారులు మెజారిటీ పంచాయతీలను గెలుచుకున్నారు.  

Local war : పల్లెల్లో జనసేన  పునాది

Local war

ఈ ఎన్నికల్లో జనసేన తన ఉనికిని బలంగా చాటుకుంది. జనసేన మద్దతుదారులు దాదాపు 250 కంటే ఎక్కువ సర్పంచ్ స్థానాలను, వేల సంఖ్యలో వార్డు సభ్యుల స్థానాలను గెలుచుకున్నారు. మొత్తం ఓట్ల శాతంలో జనసేన సుమారు 18% నుండి 27% వరకు (కొన్ని ప్రాంతాల్లో) సాధించినట్లు ఆ పార్టీ ప్రకటించింది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా మరియు గుంటూరు జిల్లాల్లో జనసేన గణనీయమైన ప్రభావాన్ని చూపింది.

Local war : జెడ్సీల్లో   నయా హిస్టరీ ..

Local war

ఇక జిల్లా పరిషత్​, మండల పరిషత్​ ఎన్నికల్లోనూ వైసీపీ దూసుకు పోయింది. టీడీపీని ఊడ్చి వేసింది. మొత్తం 660 జడ్పీటీసీ (ZPTC)  స్థానాలకు గాను, వైసీపీ 642 స్థానాలను  గెలుచుకుంది. ఇందులో  126 జడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. 13 ఉమ్మడి జిల్లా పరిషత్తులను కైవశం చేసుకుంది. ఇక  10,047 MPTC  స్థానాలకు గాను, 8,249   స్థానాలను వైసీపీ కైవశం చేసుకుంది.   ఇందులో 2,371 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 660 మండలాలకు గాను వైసీపీ 635  మండలాల్లో అధ్యక్ష పీఠాలను దక్కించుకుంది . అంటే 98% విజయం సాధించింది .

Local war :  అప్పుడు టీడీపీ వామ్మో వాయ్యో

 ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి   పది లోపు మండలాలే దక్కాయి.  చిత్తూరు జిల్లాలో కుప్పం వంటి చోట్ల కూడా వైసీపీ ఎంపీపీ స్థానాన్ని గెలుచుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. టీడీపీ కొన్ని మండలాల్లో ఎంపీటీసీల మెజారిటీ సాధించినప్పటికీ, అనేక చోట్ల ఫిరాయింపులు,  ఇతర రాజకీయ సమీకరణాలతో  ఎంపీపీ పదవులను కోల్పోయింది.

Local war

 కుప్పం నియోజకవర్గ పరిధిలోని రామకుప్పం మండలంలో టీడీపీ అభ్యర్థి సులోచన ఎంపీపీగా ఎన్నికయ్యారు. పశ్చిమ గోదావరి, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లోని సుమారు 4-5 మండలాల్లో టీడీపీకి మెజారిటీ ఉన్నప్పటికీ, చివరి నిమిషంలో వైసీపీనే అధ్యక్ష పీఠాలను దక్కించుకుంది. శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో   కొన్ని ఎంపీటీసీ స్థానాలు గెలిచినప్పటికీ, మండల అధ్యక్ష పదవులను (MPP) మాత్రం  టీడీపీ దక్కించుకోలేకపోయింది.  మొత్తం మీద 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులతో పాటు అత్యధిక ఎంపీపీ పదవులను వైసీపీ కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది.

.

Local war : పట్టణాల్లోనూ  జైత్ర యాత్ర

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 10, 2021న 12 నగరపాలక సంస్థలు (Corporations) 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి.  ఎన్నికలు జరిగిన 75 మున్సిపాలిటీల్లో 73 మున్సిపాలిటీలను వైసీపీ గెలుచుకుంది.12 కార్పొరేషన్లలో 11 కార్పొరేషన్లను (విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి ప్రధాన నగరాలతో సహా) వైసీపీ కైవసం చేసుకుంది. ఏలూరు కార్పొరేషన్ ఫలితం అప్పట్లో కోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది, తర్వాత ఏలూరు  కూడా వైసీపీ వశమైంది.

Local war

  ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఈ ఎన్నికల్లో భారీగా నష్టపోయింది.  పోటీ జరిగిన 11 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్కటి కూడా గెలవలేకపోయింది.  మొత్తం 75 మున్సిపాలిటీలలో టీడీపీ కేవలం రెండు (తాడిపత్రి, మైదుకూరు) మున్సిపాలిటీల్లోనే మెజారిటీ సాధించగలిగింది. రాష్ట్రవ్యాప్తంగా 2,122 మున్సిపల్ వార్డులలో టీడీపీ సుమారు 270 వార్డులను మాత్రమే గెలుచుకుంది. అమరావతి ప్రాంతంలోని విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో సైతం టీడీపీ ఓటమి చవిచూసింది.

Local war :  కింగ్​ మేకర్ ​గా జేఎస్పీ చరిత్ర  

జనసేన ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. విశాఖపట్నం (GVMC)లో 3, , గుంటూరులో 2 స్థానాలను గెలుచుకుంది. ఏపీలో  19 మున్సిపల్ వార్డులను జనసేన గెలుచుకుంది. మైదుకూరు మున్సిపాలిటీలో జనసేన గెలిచిన ఒకే ఒక్క వార్డు ఫలితాన్ని తారుమారు చేయడంలో (కింగ్ మేకర్‌గా) కీలకంగా మారింది.

Local war

 మైదుకూరు మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉండగా,  టీడీపీకి  12 వార్డులు, వైసీపీ కి 11 వార్డులు, జనసేనకు  01 వార్డు (6వ వార్డు అభ్యర్థి బాబు జయప్రకాష్) వచ్చాయి.  మున్సిపల్ చైర్మన్ పీఠానికి  మేజిక్ ఫిగర్ 13 .   టీడీపీ  ఒక్క సీటు తక్కువైంది.   వైసీపీకి 11 వార్డులు వచ్చాయి.  మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్-అఫీషియో ఓట్లు (స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు) కీలకం. వైసీపీకి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి రూపంలో ఒక ఎక్స్-అఫీషియో ఓటు ఉంది, దానితో వైసీపీ  బలం 12కి చేరింది.  ఈ స్థితిలో చైర్మన్ ఎన్నికలో జనసేన కౌన్సిలర్ ఇచ్చే ఒక్క ఓటు ఎవరికి పడితే వారు గెలిచే అవకాశం ఏర్పడింది. టీడీపీ చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే జనసేన మద్దతు తప్పనిసరి అయ్యింది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, జనసేన కౌన్సిలర్ మద్దతుతో టీడీపీ అభ్యర్థి మాచనూరి చంద్ర మైదుకూరు మున్సిపల్ చైర్మన్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తున్న సమయంలో, కడప జిల్లాలో (వైసీపీ కంచుకోట) టీడీపీ ఈ మున్సిపాలిటీని గెలుచుకోవడం వెనుక జనసేన కౌన్సిలర్ ఓటు అత్యంత కీలకంగా మారింది. అందుకే అతన్ని అందరూ కింగ్ మేకర్ అని పిలిచారు.

Local war : ఆషామాషీ కాదు గురూ

అధికార మార్పిడిలో ఆంధ్రులు ఆషామాషీ కాదు. కోరితే ఒక్క చాన్సు ఇస్తారు.  పల్లకి మోస్తారు. తిక్కరేగిందో.. అదే రీతిలోనూ తిరస్కరిస్తారు. ఈడ్చికొట్టి ఊడ్చేస్తారు.  ఇందులో ఎలాంటి అనుమాఃనం అక్కర్లేదు. అఖండ ఆంధ్రావని విభజన తర్వాత.. ఎన్డీయే కూటమి కావొచ్చు..వైసీపీ కావొచ్చు. ఒక పార్టీ అభివృద్ధి మంత్రంతో ఐదేళ్లు పాలిస్తే.. మరో పార్టీ సంక్షేమం పేరుతో లక్షల కోట్లు వెదజల్లి ఐదేళ్లకు ముందే ఓట్లు కొనుగోలు తంత్రం ప్రయోగించింది.  కానీ జనం మాత్రం ఆ పార్టీకి సున్నం కొట్టారు. పాపం అప్పటి సీఎం  130 సార్లు బటన్​ నొక్కి 2 లక్షల 70 వేల కోట్లు డీబీటీలో జమ చేస్తే..151 సీట్ల వైసీపీకి మధ్యలో 5 తీసి 11 సీట్ల కు పరిమితం చేశారు.. ఏపీ జనం. కనీసం ప్రతిపక్షం హోదా ఇవ్వలేదు. ఇప్పటి వరకూ ప్రతిపక్ష హోదా కోసం అలిగి అసెంబ్లీకి వైసీపీ అధినేత దూరం కాగా.. తాజాగా జెడ్​ కేటగిరి ఇవ్వాలని వైసీపీ సెకండరీ నేతలు గగ్గోలు పెడుతున్నారు.

Local war

ఈ సంగతి సరే.. టీడీపీకీ  ఏపీ జనం ఇదే రీతిలో తాట తీశారు. ఎన్నికల వేళ..పసుపు కుంకుమ పేరిట మహిళల ఖాతాలో డబ్బు జమ చేసిన టీడీపీ అధినేతకూ చుక్కలు చూపించారు. ముఖాన పపుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టారు, ఆంధ్రా ఆడబిడ్డలు. 23 సీట్లకు పరిమితం చేశారు. ఏతావాతా ఏంటంటే.. ప్రభుత్వాధినేతలు సంక్షేమం పేరిట ఓట్ల కోసం వల వేస్తే..జనం దొరికిపోరు. తగు సమయంలో తగినట్టే స్సందిస్తారని ఏపీ రాజకీయాలు నిరూపించాయి. ఇక లోకల్​ ఫైట్​ లో.. అధికార కూటమి, ప్రత్యర్థి వైసీపీ ఏ రీతిలో తలపడతాయో? వేచి చూద్దాం.

also read : @ 1000 videos  వెయ్యి పడగల రాణి  Andhara prabha Insight Story

Leave a Reply