Election | బండి ఆరోపణలను ఖండించిన మంత్రి పొన్నం

Election | బండి ఆరోపణలను ఖండించిన మంత్రి పొన్నం
Election | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఎంఐఎంతో కాంగ్రెస్ రూ.100 కోట్ల డీల్ చేసుకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. ఇవాళ కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీరుతో కరీంనగర్ అవినీతిమయమైందని ఆరోపించారు.
కార్పొరేషన్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకున్నాయని పొన్నం ఆరోపించారు. ఆ రెండు పార్టీల పరస్పర అవగాహనతోనే అభ్యర్థుల ఎంపిక కూడా జరిగిందన్నారు. ఇక జిల్లా పరిధిలోని కొండగట్టు, వేములవాడ ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని.. పదేళ్లలో కరీంనగర్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
