బల్దియా పోరులో 11మంది అభ్యర్థులు

బల్దియా పోరులో 11మంది అభ్యర్థులు
- త్వరలో ఇందూర్ కు రానున్న పవన్ కళ్యాణ్
- నగరంలో కార్నర్ మీటింగ్ కు ప్రధాన కూడళ్ల పరిశీలన
- పర్యటన తేదీ త్వరలోనే వెల్లడి..
నిజామాబాద్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ బల్దియా పోరులో జనసేన సైన్యం బరిలో నిలిచారు. నిజా మాబాదులో మొత్తం 60 డివిజన్లకు గాను 11 మంది అభ్యర్థులు జనసేన పార్టీ నుంచి పోటీలో నిలిచారు. అన్ని పార్టీలకు దీటుగా మేఏం తీసిపోమంటూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల గెలుపుకు జనసేన పార్టీ వర్గాలు కృషి చేస్తున్నారు. జనసేన అధినేత ఆదేశాల మేరకే మున్సిపల్ కార్పొ రేషన్ ఎన్నికల్లో నిల్చు న్నట్లు జనసేన పార్టీ శ్రేణు లు తెలిపారు.ఈ ఎన్ని కల్లో జనసేన పార్టీ బలో పేతానికి కృషి చేసి జన సేన సత్తా చూపు తామని పార్టీ వర్గాలు తెలిపాయి. 11 మంది అభ్యర్థులను గెలిపించుకుంటామని ధీ మా వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో ఇందూర్ కు రానున్న పవన్ కళ్యాణ్
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను పురస్కరించుకొని జనసేన పార్టీ అధినేత, సినీ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరలో ఇందూ ర్కు రానున్నారు. నిజా మాబాద్ నగరంలోని ప్రధా న కూడలిలో కార్నర్ మీ టింగ్ నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ శ్రేణులు తెలి పారు. నగరంలోని ప్రధాన కూడలిలను పరిశీ లిస్తు న్నారు. నగరంలోని రాజా రాజేంద్ర చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా ప్రధాన కూడళ్ళ ను పరిశీలిస్తున్నారు. పవన్ కళ్యా ణ్ పర్యటన తేదీని త్వరలో వెల్లడించ నున్నారు.
జబర్దస్త్ నటులతో ప్రచార పర్వంలో…
నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జన సేన పార్టీ శ్రేణులు జబర్దస్త్ కామెడీ నటులతో ప్రచార చేయనున్నట్లు జనసేన పార్టీ శ్రేణులను తెలిపారు. 11 డివిజన్లో నుంచి పోటీ చేస్తున్న జనసేన అభ్య ర్థులకు మద్దతుగా జబర్దస్త్ నటులు త్వరలో ఇందూర్ కు రానున్నారు.
జనసేన అభ్యర్థులను గెలిపించుకుంటాం
నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ 11 మంది అభ్యర్థులను గెలిపించు కుంటామని జనసేన పార్టీ జిల్లా ఇన్చార్జ్ గుండా సం తోష్ తెలిపారు. జనసేన అభ్యర్థు లకు నగరంలో ప్రజల నుండి మద్దతు వస్తుందన్నారు. డివి జన్ లలో జనసేన అభ్యర్థు లకు ప్రజలు మంగళ హారతు లతో స్వాగతం పలుకుతు న్నారని అన్నా రు. ఈ పోరులో అన్ని పార్టీలకు దీటుగా జన సేన సత్తా చాటుతామని భీమా వ్యక్తం చేశారు.
ఇందూర్ లో జనసేన అభ్యర్థులు వీరే ..
18వ డివిజన్ ఆర్. అరుణ్, 42వ డివిజన్ కె.సాయిబాబు, 7వ డివిజన్ ఎన్.రాహుల్, 38వ డివిజన్ అర్జున్,3వ డివిజన్ బండ్ల ప్రసన్న,39వ డివిజన్ ఎస్ వి మీనా ,16వ డివిజన్ బి.నరేందర్,17వ డివిజన్ సి. రవి,48వ డివిజన్ సిహెచ్ శ్రీనివాస్,9వ డివిజన్ ఒల్లెపు సుజాత, 51వ డివిజన్ పి.కృష్ణ లు బరిలో నిలిచారు.
