AP | అడుగడుగునా ఆంక్షలు

AP | అడుగడుగునా ఆంక్షలు

  • అష్టదిగ్బంధనములో గుంటూరు నగరం

AP |ఉమ్మడి గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ: మాజీ ముఖ్యమంత్రి జగన్ గుంటూరు పర్యటనకు కూటమి సర్కార్ అడుగడుగునా ఆంక్షలు విధించింది. గుంటూరు పోలీసులు నగరానికి నలువైపులా చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. జగన్ రాకను పురస్కరించుకొని అర్ధరాత్రి నుంచే వైసిపి నేతల ఇళ్లకు వెళ్లి హడావుడి చేశారు. జగన్ పర్యటన వైపు వెళ్లకూడదంటూ నోటీసులు జారీ చేశారు నోటీసులు అందుకున్న వాళ్లలో మాజీ ఎంపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు పశ్చిమ ఇన్చార్జి నూరి ఫాతిమా, మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు పత్తిపాడు ఇన్చార్జి బలసాని కిరణ్ కుమార్, పొన్నూరు ఇంచార్జ్ అంబటి మురళి ఉన్నారు. వీరితోపాటు మాజీ మంత్రులు విడుదల రజని, మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి ఇన్చార్జి దొంతి రెడ్డి వేమారెడ్డికి కూడా నోటీసులు అందించి బయటకు రావద్దని పోలీసులు సూచించారు.

జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు విధించిన ఆంక్షలు పై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ను కలిసేందుకు వస్తున్న శ్రేణుల్ని ఎక్కడికక్కడే అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. పలుచోట్ల భారీ కేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ డైవర్షన్ వాహనాల తనిఖీ చేపట్టడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక మాజీ సీఎంను అడ్డుకోవాలని ఇంతగా ప్రయత్నించడమేమిటంటే ప్రజలు చర్చించుకుంటున్నారు. గుంటూరులో కర్ఫ్యూ తరహా వాతావరణం నెలకొనడంపై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంక్షలు వలయాన్ని దాటుకొని జగన్ను చూసేందుకు కలిసేందుకు పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో గుంటూరు నగరానికి చేరుకున్నారు.

Leave a Reply