TG | నాగర్ కర్నూల్ను అభివృద్ధి చేస్తాం…

TG | నాగర్ కర్నూల్ను అభివృద్ధి చేస్తాం…
ఆరో వార్డుకు మూడు కోట్ల నిధుల పనులు
ఆరవ వార్డు అభివృద్ధికి కృషి చేస్తాను
ఎమ్మెల్సీ కుచ్ కుల దామోదర్ రెడ్డి
TG | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్సీ కూచిపూడి కూచుకుల్ల దామోదర్ రెడ్డి చెప్పారు మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్ పట్టణంలోని బీసీ కాలనీ ఆరవ వార్డులో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఆరో వార్డు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన పెయింటర్ సీనును గెలిపించాలని ఓటర్లను కోరారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో 1000 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆరవ వార్డులో ఈ రెండు సంవత్సరాలలో కోటి యాభై లక్షలతో సిసి రోడ్లు వేశామని 25 లక్షల నిధులతో అండర్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టామని అయ్యప్ప గుడి వద్ద 35 లక్షల నిధులతో అర కిలోమీటర్ సిసి రోడ్డు వేశామని ఎమ్మెల్సీ చెప్పారు. 3లక్షల నిధులతో ఆరో వార్డులు బోర్లు వేశామని అదేవిధంగా 30 లక్షలతో రెండు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేశామని 40 విద్యుత్ పోల్స్ వార్డులో వేసి విద్యుత్ స్మిత్ షా సమస్య తీర్చడానికి కృషి చేశామని ఎమ్మెల్సీ వివరించారు. రాబోయే కాలంలో కూడా ఈ వార్డును అన్ని విధాల అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఆయన వెంట అభ్యర్థి పెయింటర్ సీను కాంగ్రెస్ నాయకుడు జహంగీర్ తదితరులు ఉన్నారు.
