Telangana | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Telangana | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Telangana | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో చేవెళ్ల నియోజకవర్గంలోని పలువురు బీజేపీ నేతలు.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు న్యాయం జరగాలంటే పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్నారు. రెండోసారి మోసపోతే.. మనం తప్పు చేసిన వాళ్లమవుతామని చెప్పారు. ఈసారి కేసీఆర్ సీఎం అయితే తెలంగాణలో మిగిలిన సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
చేవెళ్లలో కాలె యాదయ్యను తన మనిషి అనుకుని కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ గెలిపించిన కొన్ని రోజులకే.. ఆయన కాంగ్రెస్ గూటికి వెళ్లాడంటూ మండిపడ్డారు. యాదయ్య పార్టీ మారినట్లు ఆధారాలున్నాయని.. ఆయనపై వేటు వేయాలని స్పీకర్‌ను కోరితే.. యాదయ్య.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని స్పీకర్ అంటున్నారని పేర్కొన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, యాదయ్యలు చిన్ననాటి నుంచి దోస్తులని.. వీరిద్దరూ ఒకే బండిపై తిరిగేవారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
