Arasavilli Temple | స్వామిని దర్శించుకున్న రామ్మోహన్ నాయుడు దంపతులు..

Arasavilli Temple | స్వామిని దర్శించుకున్న రామ్మోహన్ నాయుడు దంపతులు..

Arasavilli Temple, శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : రథసప్తమి రోజున అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులుతో కలసి ఆదివారం అర్థరాత్రి సమర్పించారు. రాష్ట్ర మంత్రితో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు స్వామిని దర్శించుకున్నారు.

జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు దంపతులు, హోం మంత్రి వంగలపూడి అనిత, శాసన మండలి సభ్యులు వరుదు కళ్యాణి, పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణణ్, శాసన సభ్యులు గొండు శంకర్, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, మార్క్ ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు, తదితర అధికారులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

Leave a Reply