Subsidy | రైతే రాజు..

Subsidy | రైతే రాజు..
- కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం..
- మేడారంలో శాశ్వత కట్టడాలు…
- వ్యవసాయ పనిముట్లు రైతులకు అందించిన ఎమ్మెల్యే పాయం…
Subsidy | బూర్గంపాడు, ఆంధ్ర ప్రభ : నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజు చేయాలని సంక్షేమ పథకాలు అందిస్తే నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రైతే రాజుగా ఎదగాలని రైతు ప్రభుత్వంగా కొనసాగుతుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఈ రోజు మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో రైతులకు సబ్సిడీ(Subsidy) ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా అందించే కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు.
ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు లబ్ధి పొందిన 29 మంది రైతులకు యంత్ర పరికరాములను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నాడు రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం దేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి ఉచిత కరెంటు తొమ్మిది గంటలు అందించి నాంది పలకగా దానితోపాటు రైతులకు రుణమాఫీ చేసి అప్పుల ఊబిలో నుంచి విముక్తి పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం అనంతరం గత పది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ ఎస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి పనిముట్లు గాని, సంక్షేమ పథకాలు అమలు విషయంలో కొరతను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
కావున రైతంగం తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రెండేళ్లలో రైతును రాజు చేయటానికి అనేక సంక్షేమ పథకాలను తెచ్చి వ్యవసాయం చేసే ప్రతి రైతుకు తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ముందుకెళుతుందన్నారు. పంట నష్టపరిహారం ఎకరానికి 10,000 అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.
గోదావరి నీళ్లు బూర్గంపాడు మండలం నుండి వెళ్తున్న మండలానికి నీరు అందించిన గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దోమల వాగు ఆయకట్టు ప్రాంత రైతులకు సీతారామ ప్రాజెక్ట్ కాలవ నుండి నీరు అందించి ఆదుకున్న ప్రభుత్వమని గుర్తు చేశారు. కిన్నెరసాని ఎడమ కాలువ 37 కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అందించడం జరిగిందన్నారు. సీతారామ ప్రాజెక్టు పై మినీ రిజర్వాయర్ ఏర్పాటుచేసి దుర్గంపాడు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏ ఒక్క ఎకరం ఎండిపోకుండా అందించేందుకు త్వరలో అనుమతులు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం అందిస్తానన్నారు.
30 లక్షల మోటార్లకు ఫ్రీ కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు. జై కిసాన్ అన్న పదానికి అర్థం చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతం గుర్తు చేశారు. రైతు ఆర్థిక అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా పుష్కలంగా సాగునీరు ఉండాలని అలాంటి నీరు మండలంలో వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతుకు అందేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి సిద్ధంగా ఉన్నామన్నారు.
నూతన టెక్నాలజీని ఉపయోగించి యంత్ర పనిముట్లు రైతులు అందించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చి కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెంది జై కిసాన్ అన్న పదానికి నాంది పలకటానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధ శుద్ధితో పనిచేస్తుందన్నారు. రైతు చల్లగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రైతుల ప్రక్షాళన ఉంటుందని గుర్తు చేశారు
సీఎం రేవంత్ రెడ్డి సారద్యంలో మేడారంలో శాశ్వత కట్టడాలు ..
మేడారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కానీ విని ఎరగని రీతిలో రాతి కట్టడాలు శాశ్వతంగా ఉండే విధంగా నిర్మాణాలు చేపట్టడం జరగటం సంతోషకరమైన విషయం అన్నారు. 250 కోట్లతో 100 రోజుల ప్రణాళికతో అభివృద్ధి దిశగా చెందటం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో మంత్రి సీతక్క, మంత్రి కొండా సురేఖ, ఆలయ కమిటీ దగ్గరుండి పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తుందన్నారు.
గత ప్రభుత్వం మేడారంలో జాతర సమయంలోనే హడావుడిగా పనులు చేసి కోట్ల రూపాయల ధనం దుర్వినియోగం చేసి చేతులు దులుపుకుందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మేడారం తెలంగాణ కుంభమేళగా ఉండేందుకు నలుమూలల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా శాశ్వతంగా కట్టడాలు నిర్మించి సమ్మక్క సారక్క దేవతల ఆశీస్సులు పొందుతుందన్నారు.
జంపన్న వాగు ప్రాంతంలో అధునాతన స్నాన ఘట్టాలు భక్తులకు ఇబ్బంది లేకుండా నీటి సదుపాయం రోడ్లు నిర్మాణం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్ల నిర్మాణాలు, భక్తులు పులకరించే విధంగా గిరిజన సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా బొమ్మలు నిర్మాణాలు జరుగుతున్నాయని మేడారం అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం లోని సీఎం రేవంత్ రెడ్డికే ఆ ఖ్యాతి దక్కుతుందని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు ఒకవైపు, రాష్ట్ర అభివృద్ధి ఆలయాల అభివృద్ధి మరొకవైపు , విద్య వైద్య రంగాలలో మెరుగైన అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా అవినీతి జరగకుండా నాణ్యమైన పనులు, నిర్మాణాలు జరిపించుట కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు.
అనంతరం రైతులతో మాట మంచి కలిపి పలకరించారు. కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతూ మండల సమస్యలపై తమ దృష్టికి తీసుకురావాలని ఎలాంటి సమస్య ఉన్న పరిష్కరించడానికి తాము 24 గంటలు అందుబాటులో ఉంటాను అన్నారు. ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్త కు న్యాయం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏడిఏ తాతారావు, మండల అభివృద్ధి అధికారి జమలారెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి శంకర్, జిల్లా మైనారిటీ సంఘం అధ్యక్షులు మహమూద్ ఖాన్, మాజీ ఎంపీపీ కైపు రోషి రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు భజన సతీష్, బూర్గంపాడు ఉపసర్పంచ్ గుండి వెంకన్న, లక్ష్మీపురం మాజీ ఉపసర్పంచ్ పోతిరెడ్డి వెంకటేష్ రెడ్డి, కెవిఆర్ అగ్రి సొల్యూషన్ నిర్వాకులు రాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
