Bellampalle | సీపీఐ శత జయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి

Bellampalle | సీపీఐ శత జయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి
- బెల్లంపల్లిలో పోస్టర్ ఆవిష్కరణ
- ఖమ్మం సభకు 40 దేశాల ప్రతినిధులు రాక
Bellampalle | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : సీపీఐ ఆవిర్భవించి వంద ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం బెల్లంపల్లి పట్టణ కార్యాలయంలో ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతదేశ రాజకీయాల్లో సీపీఐది ప్రత్యేక చరిత్ర అని, వంద ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ప్రజా పోరాటాలను నడిపిన ఘనత ఈ పార్టీకే దక్కుతుందన్నారు.
ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచే కాకుండా, సుమారు 40 దేశాల ప్రతినిధులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య, పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, డిహెచ్‌పిఎస్ జిల్లా అధ్యక్షుడు డిఆర్ శ్రీధర్, బి కె ఎం యు జిల్లా కార్యదర్శి గుండా చంద్రమాణిక్యం, నాయకులు బొంకూర్ రామచందర్, రత్నం ఐలయ్య, ఇనుముల రాయమల్లు, లింగాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
