TG | సీఎంఆర్ ఎఫ్ చెక్కు అంద‌జేత‌…

TG | సీఎంఆర్ ఎఫ్ చెక్కు అంద‌జేత‌…

TG | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన కొత్తగట్టు పుష్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో, చికిత్సా ఖర్చుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌ నుంచి 1,40,000 రూపాయల చెక్కును ఈరోజు కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేశ్ యాదవ్ ఆధ్వర్యంలో పుష్పకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మహేశ్ యాదవ్.. ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజల అవసరాలకు త్వరగా స్పందిస్తూ, ఇలాంటి సహాయాలతో ప్రతి ఇంటికీ ఆసరా అందిస్తోందని చెప్పారు. గ్రామస్థులు ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మర్రి రాజు, బత్తిని మల్లయ్య, కోలా లింగయ్య, మాసంపల్లి ప్రభాకర్, కసి గుజ్జుల బ్రహ్మతేజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply