హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించిన డ‌బ్ల్యుహెచ్‌వో

హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించిన డ‌బ్ల్యుహెచ్‌వో

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఎబోలా వ్యాప్తి దృష్ట్యా డబ్ల్యూహెచ్‌వో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. కాంగో, ఉగాండాలో 300 ఎబోలా కేసులు వెలుగులోకి వచ్చాయి. కాంగాలో ఎబోలాతో 88 మంది మరణించినట్లు వెల్లడించింది. ఉగాండాలో ఒక‌రు మృతి చెందిన‌ట్లు చెప్పింది. ఈ వ్యాధి ప్రస్తుతం డెమోక్ర‌టిక్ రిప‌బ్లిక్ ఆఫ్ ద కాంగో, ఉగాండ‌లో వేగంగా వ్యాపిస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది.

ఈ వ్యాప్తికి కారణమైనది అరుదైన “బుండిబుగ్యో” ఎబోలా వైరస్ ర‌కానికి ఎలాంటి వ్యాక్సిన్ కానీ చికిత్స కానీ లేదు. WHO ప్రకారం ఇది అంతర్జాతీయ స్థాయిలో సమన్వయ చర్యలు అవసరమైన పరిస్థితి అయినప్పటికీ, ప్రస్తుతం దీనిని “పాండమిక్ ఎమర్జెన్సీ”గా మాత్రం ప్రకటించలేదు.

Leave a Reply