5acres crop | శ్రీగంధం తోటలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం..!

5acres crop | శ్రీగంధం తోటలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం..!

5acres crop | జొన్న చొప్ప కాల్చడంతో తోటకు వ్యాపించిన మంటలు
శ్రీగంధం, మామిడి, జామ తోటలు పూర్తిగా దగ్ధం
అప్రమత్తమైన స్థానికులు.. అదుపులోకి వచ్చిన మంటలు
రైతుల అవగాహన లోపమే అగ్ని ప్రమాదాలకు కారణమా?

5acres crop | ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టి సావర్గం శివారులో పంట తోటలో శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదు ఎకరాల్లో ఉన్న శ్రీ గంధం, మామిడి, జామ పంటలు అగ్నికి అహుతయ్యాయి. మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడడంతో రైతులు ఆందోళన చెందారు. స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించ ఫైర్ ఇంజన్ వాహనాలు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

జొన్న పశుగ్రాసం కాల్చడం వల్లే .. పంటతోటకు అంటుకున్న నిప్పు..!

బట్టి సావర్గం శివారులోని ఓ రైతు జొన్న కోత అనంతరం ఎండిన చొప్పను (వ్యర్థ పదార్థం) పంట క్షేత్రంలోనే సాయంత్రం కాల్చడం జరిగింది. అయితే రాత్రివేళ నిప్పు మినుగుర్లు వేడి గాలులకు ఎగిసిపడి పక్కనే గల పంటతోటకు నిప్పు అంటుకుంది. కుందూరు రాజు @కన్నామి సురేష్ తోటలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఐదు ఎకరాల్లో వేసిన జామ, శ్రీగంధం, మామిడి తోట పూర్తిగా కాలి బూడిదయింది. పక్కనే గల చేనులో జొన్న రాశులకు మంట అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైతులు అవగాహన లోపంతో వ్యర్థ పదార్థాలను పంటచేనులో కాల్చడం వల్ల తరచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ రైతులకు తీరని నష్టాన్ని కలిగిస్తోంది.

CLICK HERE TO READ వడ్ల బస్తాలను సీరియల్ వారిగా గోదామునకు తరలించండి

CLICK HERE TO READ MORE

Leave a Reply