56223 students | తెలంగాణలో 69 పరీక్షా కేంద్రాలు

56223 students | తెలంగాణలో 69 పరీక్షా కేంద్రాలు
56223 students | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్-2026ను తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులపాటు ఐసెట్ జరగనుంది. మే 13, 14 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికోసం 16 రీజినల్ సెంటర్లలో 69 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనికి మొత్తం 56,223 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఐసెట్ కన్వీనర్ అల్వాల రవి తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇప్పటికే హాల్ టిక్కెట్లను కూడా విద్యార్థులకు పంపారు. పరీక్ష కేంద్రాలను కూడా ఇప్పటికే నిర్ణయించారు. పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాలని, ఆలస్యమయితే పరీక్ష కేంద్రానికి అనుమతించబోమని అధికారులు తెలిపారు.
