2Traffic Policemen | ఏడుగురు మృతి.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో కలకలం

2Traffic Policemen | ఏడుగురు మృతి.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో కలకలం
2Traffic Policemen | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : పాకిస్థాన్ లో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని లక్కి మార్వత్ జిల్లాలో ఉన్న సారాయ్ నౌరాంగ్ బజార్‌లో ఇవాళ సంభవించిన ఈ పేలుడులో ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు సహా మొత్తం ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
లక్కి మార్వత్ జిల్లాలోని రద్దీగా ఉండే సారాయ్ నౌరాంగ్ బజార్‌లో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి సమీప ప్రాంతాలు కంపించిపోయినట్లు స్థానికులు తెలిపారు.
ఈ ఘటనలో ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు, ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. పలువురు గాయపడినట్లు సమాచారం. ఘటనాస్థలానికి భద్రతా బలగాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
