25lakh | డ్రెస్సింగ్‌రూంలో వేపింగ్ తాగడంతో బీసీసీఐ చర్యలు

25lakh | డ్రెస్సింగ్‌రూంలో వేపింగ్ తాగడంతో బీసీసీఐ చర్యలు
రియన్‌పరాగ్ మ్యాచ్ ఫీజులో 25శాతం జరిమానా
అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్
25lakh | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఆటిట్యూడ్ స్టార్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌కు షాక్ తగిలింది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ (వేపింగ్) తాగుతూ కెమెరా కంటికి చిక్కిన రియాన్ పరాగ్‌పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో 25% ((సుమారు రూ. 25 లక్షలు) జరిమానా విధించింది. అంతేకాకుండా అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా యాడ్ చేసింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పరిధిలోకి రాని ప్రత్యేక అంశాలను పరిగణనలోకి తీసుకునే ‘ఆర్టికల్ 2.21’ కింద బీసీసీఐ యాక్షన్ తీసుకుంది. పరాగ్ తన తప్పును అంగీకరించడంతో విచారణ అవసరం లేకుండానే జరిమానా ఖరారైంది. రాజస్థాన్ జట్టుపై కూడా బీసీసీఐ కఠిన చర్యలు తీసుకునే ఆలోచనలో ఉంది.
