10years | పోక్సో కేసులో మరో కఠిన సెక్షన్ జోడింపు

10years | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మైనర్ బాలికపై వేధింపుల ఆరోపణల కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్‌పై పోలీసులు మరో కఠినమైన సెక్షన్‌ను జోడించారు. దీంతో కేసు తీవ్రత మరింత పెరిగింది.
బాధిత మైనర్ బాలికపై భగీరథ్ పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆధారాలు లభించాయని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 64(2)(m)ను తాజాగా కేసులో చేర్చారు. ఒకే మైనర్‌పై పునరావృతంగా లైంగిక దాడులకు పాల్పడితే ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఇప్పటికే భగీరథ్‌పై పోక్సో చట్టంతో పాటు BNS 5(l) r/w 6, 74, 75, 11, 12 సెక్షన్ల కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే.
కొత్తగా చేర్చిన సెక్షన్ ప్రకారం నేరం రుజువైతే కనీసం 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీంతో భగీరథ్‌కు త్వరగా బెయిల్ రావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసు దర్యాప్తును మరింత లోతుగా కొనసాగించేందుకు భగీరథ్ కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. బాధితురాలి మెడికల్ రిపోర్టులు, మొబైల్ డేటా, చాటింగ్స్ వంటి సాంకేతిక ఆధారాలను ఇప్పటికే కోర్టుకు సమర్పించినట్లు సమాచారం.
