TG | మీ జాతికి జ‌రిగిన అన్యాయాన్ని స‌రిదిద్దుతున్నాం.. సీఎం రేవంత్

  • ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ తొలి అడుగు
  • ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం మ‌న‌దే
  • విశ్వవిద్యాల‌యాల్లో వీసీలుగా అవ‌కాశం ఇచ్చాం
  • రేవంత్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన ఎస్సీ నేత‌లు


హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో నేడు అసెంబ్లీ కమిటీ హాల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఎస్సీ సంఘాల నాయకులు ధన్యవాదాలు తెలిపాయి. వర్గీకరణ పోరాటంలో అమరులైన వారికి నివాళిగా 2నిమిషాలు మౌనం పాటించారు సీఎం, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు.

పెద్ద సంఖ్యలో తరలివచ్చి ముఖ్యమంత్రికి మాదిగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలు చేసినందుకు అసెంబ్లీ కమిటీ హాల్ లో సీఎం రేవంత్ కి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తరతరాలుగా ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఎస్సీ వర్గీకరణ జరగలేదని గుర్తు చేశారు.

ఎన్నటికైనా ఎస్సీ సమాజం తమ ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకోవాలనే ఈ జాతికి న్యాయం చేశానన్నారు. ఎవరికీ అన్యాయం జరగకుండా వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేస్తామని భరోసానిచ్చారు. ఎన్నో ఏళ్ల చిక్కుముడికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరిష్కారం చూపించామంటూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదని అన్నారు. ఇప్పటికీ సీఎంగా మీ వాడే ఉన్నాడని భావించాలని, ఎస్సీ కులాల సంక్షేమం, అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి మరింత ధైర్యం చెప్పారు.

రాహుల్ ను, కేబినెట్ ను అభినందించండి..
“నన్ను ఒక్కడినే కాదు.. రాహుల్ గాంధీని… కేబినెట్ ని అభినందించాలి.. రాహుల్ గాంధీ నేనున్నా అని చెప్పడంతో ధైర్యం వచ్చింది.. దామోదర రాజనర్సింహ కేబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్ తీసుకో అంటే నాకు వద్దు అన్నారు.. నా పనే నేను ఎక్కువ చేసుకున్న అనుకుంటారు అని వద్దన్నారు.. 199 పేజీల విశ్లేషణ ఇచ్చారు కమిషన్ ఛైర్మన్. ఇప్పటి వరకు ఉద్యోగాలు రాని.. వర్గాలను కూడా గుర్తించాం.. ఇప్పుడు తొమ్మిది కాదు.. పావు తక్కువ పది మీ రిజర్వేషన్. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు.. మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం.. నేను ఉన్న కాబట్టి వేగంగా సుప్రీంకోర్టు తీర్పు అమలు చేశా.. నాకు మొదటి నుండి మాదిగ పిల్లలే నా వెంట ఉన్నారు.

మీకు సహనం ఎక్కువ.. పదేళ్లు వేచి చూశారు.. నాకు అవకాశం ఇచ్చారు.. సుప్రీంకోర్టులో కేసులు వాయిదా పడుతున్నాయి.. అందుకే నేనే మంచి అడ్వకేట్ ను పెట్టీ పంపిన.. మందకృష్ణతో నాకేం విభేదం లేదు.. కానీ ఆయన నా కంటే… కిషన్ రెడ్డిని ఎక్కువ నమ్ముతున్నాడు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు.. మీ జాతికి న్యాయం చేయాలని అనుకున్న.. బిల్లుకు ప్రాసెస్ ఉంటది.. అందుకే పకడ్బందీగా చేశాం. బిల్లు అమల్లోకి వచ్చేంత వరకు నోటిఫికేషన్ ఇవ్వను అని చెప్పినా.. ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు.. పదేళ్లు నాతో జాతి నడుస్తుంది.. పొలం కాడా మీకు.. మాకే కదా సంబంధం.. మార్చిపోతమా.. ఓయూకి వీసీ ఇచ్చినా.. బాసర ఐఐఐటీకి వీసీగా మాదిగకు అవకాశం ఇచ్చాం.. ఉస్మానియా ప్రిన్సిపాల్ మాదిగ ను వేశాం.. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మన అమ్మాయే.. మా వాళ్ళను పక్కన పెట్టీ కూడా మీకు అవకాశం ఇచ్చిన.. మీకు అన్యాయం అయ్యింది అని.. అవకాశం ఇచ్చాం… అని రేవంత్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *