Poster| సేవ్ నేచర్ పోస్టర్ల ఆవిష్కరణ

Poster| మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలోని సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్స్ , కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అనే అంశానికి సంబంధించిన పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానాచార్యులు బి.కుర్మయ్య మాట్లాడుతూ విద్యార్థులు ప్లాస్టిక్ లంచ్ బాక్స్, వాటర్ బాటిల్స్ ఉపయోగించకూడదని, వాటికి బదులుగా స్టీల్ వస్తువులు వాడాలని తెలిపారు. చేతి సంచితో మార్కెట్‌కు వెళ్లడం, స్టీల్ వాటర్ బాటిల్స్, లంచ్ బాక్స్ ఉపయోగించడం విద్యార్థులు అలవాటు చేసుకోవాలి. పిల్లలు పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం అలవాటు చేసుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ఆరుబయట చెత్త కాల్చడం వల్ల గాలి కాలుష్యం అవుతుందని, అలా చేయకుండా తడి పొడి చెత్త వేరుగా చేసి చెత్తవాహనలలో వేయాలని, లేదంటే మొక్కలకు ఎరువుగా వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది శ్రీనివాస్, గోపాల్ రెడ్డి , సరస్వతీ, జయశ్రీ పాల్గొన్నారు.
