ధారూర్, ఏప్రిల్ 7 (ఆంధ్రప్రభ) : రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో రుద్రారం గ్రామానికి చెందిన కంది శ్రీనివాస్ మృతి చెందారు. శ్రీనివాస్ వికారాబాద్ వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో చింతకింది నర్సింహులు వికారాబాద్ వైపు నుంచి తన స్వగ్రామానికి వస్తుండగా రెండు బైకులు ఢీకొన్నాయి.
నర్సింహులుకు తీవ్ర గాయాలు కాగా, కంది శ్రీనివాస్ మృతిచెందారు. వెంటనే వికారాబాద్ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. ఈ సంఘటన రాత్రి ఎబ్బనూర్ గ్రామం దగ్గర ఉన్న చెరువు సమీపంలో చోటుచేసుకుంది. మృతిచెందిన వ్యక్తిని మార్చురీకి తరలించడం జరిగింది. గాయాలైన వ్యక్తికి చికిత్స అందిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.