Train | రాకపోకలకు తీవ్ర అంతరాయం

Train | రాకపోకలకు తీవ్ర అంతరాయం

Train | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నెల్లూరు జిల్లాలో రైల్వే ప్రమాదం చోటుచేసుకుంది. గూడ్స్ రైలు బోగి పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా మనుబోలు సమీపంలోని కొమ్మరపూడి రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ ట్రైన్ ప్రమాదానికి గురైంది. విజయవాడ నుంచి తిరుపతికి వెళ్తున్న గూడ్స్ రైలు బోగి అకస్మాత్తుగా పట్టాలు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పలు రైళ్లను నిలిపివేయడంతో పాటు మార్గం మార్చినట్లు సమాచారం. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలు పునరుద్ధరించేందుకు పనులు కొనసాగుతున్నాయి. రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భారీ క్రేన్ల సహాయంతో ట్రాక్‌పై పడిపోయిన ట్యాంకర్‌ను తొలగించేందుకు రైల్వే ఇంజనీరింగ్ విభాగం కృషి చేస్తోంది.

Leave a Reply