Tirumala Tour | రేపు తిరుమ‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్

వెల‌గ‌పూడి – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకోనున్నారు. అనంతరం టీటీడీ గోశాలను పరిశీలించనున్నారు. ఈ మేరకు గోశాలకు వెళ్లి గోవుల మృతి అంశంపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. ఎస్వీ గోశాలలో ఆవుల మృతి చెందాయని భూమన విమర్శలు చేయగా టీడీపీ, వైసీపీ మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కూడా టిటిడి అధికారుల‌తో ప‌వ‌న్ చ‌ర్చించ‌నున‌ట్లు స‌మాచారం.

Leave a Reply