రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మండలం రాంపల్లి–మారేడుగొండ శివారులోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయం గేటు తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.
అమ్మవారి నగలు, హుండీలో ఉన్న నగదు, అలాగే కొంత విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
