మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
(అవుకు రూరల్, ఆంధ్రప్రభ) : అవుకు రిజర్వాయర్ సమీపంలోని మలుపు వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు లారీ ప్రమాద ఘటన చాలా బాధాకరమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (BC JanardhanReddy) తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం అవుకు రోడ్డు ప్రమాదంలో మరణించిన మహిళ కుటుంబానికి మంత్రి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
అవుకు రిజర్వాయర్ (Avuku Reservoir) వద్ద రోడ్డు ప్రమాదంలో.. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ ప్రాణాలు కోల్పోవడంపై మంత్రి బీసీ జనార్ధన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బనగానపల్లె నుంచి తాడిపత్రికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొని ఒకరు మృతి చెందడం, 20 మంది తీవ్ర గాయాల పాలవడం అత్యంత దురదృష్టకరం అన్నారు.
ముంబై పర్యటన (Mumbai tour) లో ఉన్నప్పటికీ.. రోడ్డు ప్రమాద విషయం తెలుసుకుని జిల్లా కలెక్టర్ తో మాట్లాడి, అధికార యంత్రాంగాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అప్రమత్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని వైద్యాధికారులు సూచించారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకోవాలని పోలీస్ రెవెన్యూ అధికారులకు మంత్రి ఆదేశించారు. బాధిత మహిళ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు.

