Crime News | చైల్డ్‌ ట్రాఫికింగ్ కీల‌క సూత్ర‌ధారి వంద‌న అరెస్ట్

అహ్మ‌దాబాద్ నుంచి పిల్ల‌ల‌ను తీసుకొచ్చి అమ్మ‌కం
గుజ‌రాత్ లో అరెస్ట్ చేసిన హైద‌రాబాద్ కు తీసుకొచ్చిన పోలీసులు
మ‌గ బిడ్డ‌కు రూ.3.50 ల‌క్ష‌లు, ఆడ‌బిడ్డ‌కు రూ.2.50 ల‌క్ష‌లు
చెత్త ఏరుకునే దంప‌తుల పిల్ల‌లే టార్గెట్
అయిదు రోజుల క‌స్ట‌డీని కోరిన పోలీసులు

హైదరాబాద్‌ నగరంలో కలకలం రేపిన చైల్డ్‌ ట్రాఫికింగ్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక సూత్రధారి వందన అనే మహిళను అరెస్ట్ చేశారు. అహ్మదాబాద్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాదులో అమ్మినట్లు గుర్తించారు. ఇక, హైదరాబాదులోని నలుగురు బ్రోకర్లకి నలుగురు పిల్లలని వందన అమ్మినట్లు విచారణలో తేలింది. ఒక్కొ పిల్లకి ఐదు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. అయితే, అహ్మదాబాద్ కు చెందిన వందనను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు వందనను తీసుకొచ్చి రిమాండ్ చేశారు. దీంతో వందనను 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు.

అయితే, వందన అనే మహిళ ఆసుపత్రుల నుంచి లేదా రోడ్లపై చెత్త ఏరుకునే వారి పిల్లలను అపహరించినట్లు తమ విచారణ తేలిందని పోలీసులు పేర్కొన్నారు. వీరితో పాటు దుర్బరమైన జీవితం గడుతుపున్న తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా పిల్లలను కొనుగోలు చేసినట్లే తేలిందన్నారు. ఇందులో అబ్బాయికి రూ. 3.5 లక్షలు, అమ్మాయికి రూ. 2.5 లక్షల ధరకు కొనుగోలు చేసి.. పిల్లలు లేని జంటలకు అమ్ముతుంది.. ఇక, వారి దగ్గర నుంచి ముందస్తుగానే అధికంగా నగదు రూపంలో డబ్బులు తీసుకున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.

Leave a Reply