భూ తగాదాలు కారణంగా వృద్ధ దంపతుల నిర్బంధం

భూ తగాదాలు కారణంగా వృద్ధ దంపతుల నిర్బంధం

జైపూర్ (ఆంధ్రప్రభ): మండలంలోని వేలాల గ్రామంలో భూ వివాదం ముదిరి ఒక వృద్ధ దంపతుల స్వేచ్ఛను హరించే స్థాయికి చేరింది. సీసీ రోడ్డు నిర్మాణంలో తలెత్తిన తగాదా కారణంగా వారిని ఇంటి నుంచే బయటకు రాకుండా కంచె వేసి నిర్బంధించిన ఘటన మంగళవారం స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే..
గ్రామానికి చెందిన చిన్న మల్లయ్య, వార్డు మెంబర్ భర్త శంకర్ ఒకే కుటుంబానికి చెందిన వారు. అయితే, వారి కాలనీలో ప్రభుత్వం చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనుల వల్ల భూమి కోల్పోవాల్సి రావడంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. ఒక కుటుంబం రెండు గుంటల భూమిని, మరో కుటుంబం సుమారు మూడు గుంటల భూమిని ఈ పనుల కోసం వదులుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో తమకు అన్యాయం జరుగుతుందన్న కోపంతో చిన్న మల్లయ్య , అతని భార్యను ఇంటి నుండి బయటకు రాకుండా కంచె ఏర్పాటు చేసి నిర్బంధించినట్లు తెలుస్తోంది.

ఇది పూర్తిగా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల మధ్య ఉన్న భూ తగాదా,కుటుంబ కలహం. కానీ, కొందరు దీనికి రాజకీయ రంగు అద్దుతూ వివాదాన్ని పెద్దది చేసే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ఈ అమానుష ఘటనపై స్థానిక అధికారులు, పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో, ఆ వృద్ధ దంపతులకు ఎలా న్యాయం చేస్తారో వేచి చూడాల్సి ఉంది.

Leave a Reply