ప్రభుత్వ హామీలను తక్షణమే అమలు చేయాలి..

ప్రభుత్వ హామీలను తక్షణమే అమలు చేయాలి..
దండేపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ బిజెపి ఆధ్వర్యంలో సోమవారం దండేపల్లి తహశీల్దార్, రోహిత్ దేశ్పాండే, ఎంపిడివో జాగర్లమూడి ప్రసాద్ లకు వినతి పత్రాన్ని అందజేశారు,ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, వృధ్యాప, వితంతు, వికలాంగుల పింఛన్లు,కల్యాణ లక్ష్మీ, గృహ నిర్మాణ పథకం, రైతు భరోసా,భూ సమస్యల పరిష్కరం వంటి హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు,ఆసరా పింఛన్ల కొరకు లబ్దిదారులు దరఖాస్తులు చేసుకున్న ఇప్పటి వరకు అందకపోవడంతో ప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం పోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన భూ భారతిలో రైతులు ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకున్న భూ సమస్యలు పరిష్కారం అవుతాలేదని అన్నారు.ప్రభుత్వం స్పందించి భూ సమస్యలు పరిష్కరించాలని కోరారు.
గ్రామాల్లో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వెంటనె గ్రామాల్లో విధి దీపాలతో పాటు,మురుగునీరు కాలువలు,పరిశుభ్రంగా ఉండే విదంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు, ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు బందేల రవి గౌడ్, ప్రధాన కార్యదర్శి పత్తిపాక సంతోష్, మాజీ మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య, నాయకులు దుమ్మని సత్తయ్య, ముత్తె అనిల్ వర్మ,దార శేఖర్,ముత్తె వెంకటేష్,టకుమాట్ల గురువయ్య, సర్గం శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.
