డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు..

డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు..

-చరవాణిలో శుభాకాంక్షలు తెలిపిన కంకణాల రాజేశ్వర్,

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్, నంది అవార్డు గ్రహీత, పరిశోధకులు, విశ్లేషకుడు, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ బాధ్యులు డాక్టర్ నందిని సిధారెడ్డి రచించిన “అనిమేశ” కవితా సంపుటికి 2025 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం పట్ల కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, భీమ్‌గల్‌ పట్టణానికి చెందిన ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్ సోమవారం చరవాణిలో సిధారెడ్డితో సంభాషించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కంకణాల రాజేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని బందారం గ్రామంలో నర్రా రత్నమాల, బాలసిధారెడ్డి లకు నందిని సిధారెడ్డి 1955 జూన్ 12న జన్మించాడు.

శివారెడ్డి తండ్రి రజకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు యోధుడు. బందారం, వెల్కటూరు, సిద్దిపేటలో చదువు ముగించుకుని హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. పూర్తిచేసి, ఆధునిక తెలుగు కవిత్వంలో సూర్యుడు అనే అంశంపై 1981లో ఎం.ఫిల్ పట్టా పొందారు.1986లో “ఆధునిక కవిత్వం, వాస్తవికత- అవాస్తవికత” అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి పట్టా పుచ్చుకున్నాడు. మెదక్ లో కొంతకాలం పని చేసిన తర్వాత సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ గా పనిచేసి 2012లో పదవీ విరమణ పొందారు. విద్యార్థి దశ నుండే కథలు, కవిత్వం వ్రాశాడు. గులాబీ అనే చిన్న పత్రికను కూడా నడిపాడు. మంజీరా రచయితల సంఘం (మరసం) ఏర్పాటు చేసి సాహితీ కార్యక్రమాలను నిర్వహించాడు. మంజీరా బులెటిన్ కు సంపాదకత్వం వహించి ఏడు కవితా సంకలనాలను వెలువరించాడు. సోయి అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. 2001లో తెలంగాణ రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించాడు. డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించడం అనేది తెలంగాణ సాహితీవేత్తలకు గర్వకారణం అని కంకణాల అన్నారు.

Leave a Reply