బాధ్యతలు స్వీకరించిన వైద్యురాలు కవితారెడ్డి..

బాధ్యతలు స్వీకరించిన వైద్యురాలు కవితారెడ్డి..
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్
గవర్నింగ్ కౌన్సిల్
చైర్మెన్ గా డాక్టర్ కవితా రెడ్డి
నిజామాబాద్ క్రైమ్, ఆంధ్రప్రభ : ఇండియన్ ఇన్ స్టిట్యూ ట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యా మిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మెన్ గా నిజా మాబాదు నగరానికి చెందిన ప్రముఖ వైద్యురాలు కవితారెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాదులోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంస్థ కార్యాలయంలో డాక్టర్ కవితారెడ్డి చైర్మెన్ గా పదవీ బాధ్యతలు చేప ట్టారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహా దారులు, బోధన్ ఎమ్మె ల్యే పి.సుదర్శన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అతి ధులుగా హాజర య్యా రు. ఈ సందర్భంగా డాక్టర్ కవితారెడ్డి మా ట్లాడుతూ తనను ఇండియన్ ఇన్ స్టిట్యూ ట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మెన్ గా నియమిం చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సిం హతో పాటు అందుకు కృషి చేసిన పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదా రులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలుపుతు న్నానన్నారు.
ప్రజారోగ్య పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని ఆమె చెప్పారు. ప్రభు త్వ ఆసుపత్రుల్లో మెరు గైన వైద్యం అందే లా కార్యాచరణ రూపొం దించి ముందుకు సాగు తానన్నారు.హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇన్‌స్టిట్యూట్ ను మరిం త అభివృద్ధి చేస్తానని డాక్టర్ కవితారెడ్డి పేర్కొన్నారు.ఈ సంద ర్భంగా మాజీ ఎమ్మె ల్యేలు ఆకుల లలిత, ఈరవత్రి అనిల్, ఉర్దూ అకాడమి చైర్మెన్ తాహెర్ బిన్ హందా న్,సహకార యూని యన్ చైర్మెన్ మోహన్ రెడ్డి,మాజీ మేయర్ దర్మపురి సంజయ్, టీపీ సీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్,నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,రామర్థి గోపి,భక్తవత్సలం,కాకతీయ సంస్థల చైర్మెన్ రజనీకాంత్,ఫుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పాల్గుణ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య తదితరులు డాక్టర్ కవితారెడ్డిని కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాం క్షలు తెలిపారు.
