Telangana | ఓఆర్ఆర్ పై….

Telangana | ఓఆర్ఆర్ పై….

Telangana | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : భోజ‌న స‌మ‌య‌మైంద‌ని రోడ్డుప‌క్క‌న కారును ఆపేసి.. భోంచేస్తుండ‌గా… ఆగి ఉన్న‌కారును కంటైన‌ర్ లారీ ఢీకొని ఇద్ద‌రు మృతిచెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ వద్ద జరిగింది.

శామీర్‌పేట్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న కంటైనర్ లారీ ఆగి ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. శామీర్‌పేట్ ఎగ్జిట్-7 వద్ద కారులో ప్రయాణిస్తున్న కొంతమంది వ్యక్తులు కారును పక్కకు నిలిపి భోజనం చేస్తుండగా వేగంగా వచ్చిన కంటైనర్ అదుపుతప్పి కారును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply