విద్యార్థులకు ప్లేట్స్ గ్లాసులు వితరణ…

విద్యార్థులకు ప్లేట్స్ గ్లాసులు వితరణ…

సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి చేతుల మీదుగా పంపిణీ

ములకలపల్లి, ఆంధ్రప్రభ : ములకలపల్లి మండల పరిధిలో ముకమామిడి పంచాయతీలో ఎంపియుపిఎస్ గుట్టగూడెం పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కలిసి పాఠశాల విద్యార్థులకు ప్లేట్స్, గ్లాస్ లు, ఏడవ తరగతి విద్యార్థులకు జామెంట్రీ బాక్స్ వితరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి చేతులు మీదుగా పంపిణీ చేపట్టారు.ఈ సందర్భంగా సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి మాట్లాడుతూ… పాఠశాల ఉపాధ్యాయులందరూ కలిసి విద్యార్థులకు ప్లేట్స్ గ్లాసులు, జామెంట్రీ బాక్స్ లు పంపిణీ చేయడం చాలా సంతోషమని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చక్కటి చదువులను చెప్పే ఉపాధ్యాయులు ఉన్నారని.విద్యార్థులు కష్టపడి చదివి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తేవాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గూగుల్ బద్రు నాయక్ పాఠశాల యొక్క సమస్యలను స్థానిక సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. పాఠశాల ఆవరణలో పెద్ద చెట్లు ఉండడంవల్ల వాటి కొమ్మలు విరిగి కింద పడుతున్నాయని,ఆ కొమ్మలు పిల్లల మీద పడే ప్రమాదం ఉందని, పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణం చేయాలని, మన ఊరు మనబడి కార్యక్రమంలో పనులు ఆగిపోయాయని, పాఠశాల ఆవరణలో గ్రావెల్ మట్టి పొయ్యాలని, వర్షాకాలం పాఠశాల ఆవరణ మొత్తం వర్షపు నీటితో నిండి పోతుందని తెలిపారు. సమస్యలను తెలుసుకున్న సర్పంచ్ సానుకూలంగా స్పందించి సమస్యలను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ. ఉన్నత అధికారులు దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత వరకు పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

అనంతరం పాఠశాల బృందం స్థానిక సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి రామకృష్ణ దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కీసర రాంబాబు, బట్టు లక్ష్మణ్, ఆంగోత్ శ్రీను, గుగులోతు కృష్ణ, వాడే రామచంద్రు, నవభూమి రిపోర్టర్ ఆర్కే, ప్రజా గొంతుక రిపోర్టర్ గడ్డం వెంకటేష్ పాల్గొన్నారు.

Leave a Reply