క రీంనగర్ ఆంధ్రప్రభ పట్టభద్ర ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ 25 గంటలుగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ లో భాగంగా పోలైన రెండున్నర లక్షల ఓట్లలో ఇప్పటివరకు 2 లక్షల 15 వేల ఓట్లను బండిల్లుగా కట్టారు. ఇందులో సుమారు 21,256 ఓట్లు చెల్లుబాటు కాలేదు. సుమారు ఒక లక్ష 89 వేల ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. ఇంకా 35 వేల ఓట్లను బండిల్లుగా విభజన చేయాల్సి ఉంది. అందులో సైతం చెల్లని ఓట్లు ఉండనున్నాయి. ఉదయం 11 గంటల నుండి మొదటి ప్రాధాన్యత ఓట్లను కౌంటింగ్ చేసేందుకు బ్యాలెట్ పేపర్లను టేబుల్ పైకి తేనున్నారు.
కౌంటింగ్ ప్రక్రియ మందకోడిగా సాగుతూ ఉండడం, ఇన్వలిడ్ ఓట్ల సంఖ్య పెరుగుతూ ఉండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు అర్ధరాత్రి వరకు మొదటి ప్రాధాన్యత పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ జరుగుతున్న తీరు చూస్తే తుది ఫలితం బుధవారం వెలువడే అవకాశాలున్నాయి.