Nandigama | అందరికీ సురక్షిత తాగునీరు..

Nandigama | అందరికీ సురక్షిత తాగునీరు..
గుడిమెట్ల గ్రామపంచాయతీ మంచినీటి స్కీమ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతుల మీదుగా పునః ప్రారంభం..
Nandigana | నందిగామ, ఆంధ్రప్రభ : నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు (Safe drinking water) అందించే లక్ష్యంతో ఉన్నామని ప్రభుత్వ విప్ నందిగామ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. గుడిమెట్ల గ్రామపంచాయతీ పరిధిలో మరమ్మత్తులు పూర్తి అయిన మంచినీటి స్కీమ్‌ను మంగళవారం గ్రామ సర్పంచ్, కూటమి నేతలు, అధికారులు సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య లాంఛనంగా పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
తాగునీటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు చేపడుతూ, నీటి సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తామని భరోసా ఇచ్చారు. గ్రామ అభివృద్ధిలో భాగస్వాములయ్యే సంస్థలు ప్రజాప్రతినిధుల సహకారం కీలకమని పేర్కొన్నారు. మంచినీటి స్కీమ్ మరమ్మత్తులకు అవసరమైన సహకారం అందించిన క్రక్స్ బయో ఇథనాల్ కంపెనీ (Crux Bio Ethanol Company) ప్రతినిధులకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక బాధ్యతగా సంస్థ అందించిన సహాయం వల్ల గ్రామ ప్రజలకు మేలు చేకూరుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, కూటమి నాయకులు, సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పునః ప్రారంభంతో గ్రామంలో తాగునీటి సరఫరా సమస్యలు పరిష్కారమై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

