Divyavani Prashant Goud | సంక్షేమం- అభివృద్ది రెండు కళ్ళు
Divyavani Prashant Goud | సంక్షేమం- అభివృద్ది రెండు కళ్ళు
తొగరపల్లి సర్పంచ్ అభ్యర్థి దివ్యవాణి ప్రశాంత్ గౌడ్
Divyavani Prashant Goud | | కొండాపూర్, ఆంద్రప్రభ : సంక్షేమం-అభువృద్ది (Welfare-development) తనకు రెండుకళ్ళని, తొగరపల్లి గ్రామంలో అభివృద్ధితో పాటు గ్రామానికి దక్కాల్సిన సంక్షేమ ఫలాలను అందించి గ్రామంలో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తానని సర్పంచ్ అభ్యర్థి దివ్యవాణి ప్రశాంత్ గౌడ్ (Divyavani Prashant Goud ) పేర్కొన్నారు. తొలివిడత ఎన్నికల్లో భాగంగా గ్రామంలో ప్రచారం (campaign) ముమ్మరంగా సాగుస్తున్నారు. మద్దతుదారులతో గ్రామ గ్రామాన ప్రచారం నిర్వహిస్తున్నారు.
అన్ని వర్గాల ప్రజల మద్దతు తనకు ఉందని ఈ సందర్బంగా దివ్యవాణి ప్రశాంత్ గౌడ్ (Divyavani Prashant Goud ) గెలుపు పై విశ్వాసం వ్యక్తం చేశారు.. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్యం ప్రభు, నేతలు నర్సింలు, కృష్ణ, అశోక్, శీను, జబ్బర్, వినయ్, గని, ఆంజనేయులు, బాలయ్య సందీప్, నాగరాజు, మహేష్ అమీర్ తదితరులు పాల్గొన్నారు.
