Pooja | బుట్టబొమ్మ.. అందుకే ఇలా చేస్తుందా..?

Pooja | బుట్టబొమ్మ.. అందుకే ఇలా చేస్తుందా..?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పూజా హేగ్డే అంటే.. గుర్తుకురాకపోవచ్చు.. కానీ.. బుట్టబొమ్మ అంటే మాత్రం ఠక్కున గుర్తొస్తుంది. అంతలా.. జనాల్లో బాగా పాపులర్ అయ్యింది. అయితే.. ఈ అమ్మడు అందం, అభినయంతో ఆకట్టుకుని అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ నెంబర్ 1 హీరోయిన్ అయ్యింది. ఇప్పుడు టైమ్ మారింది.. ఈ బ్యూటీ సినిమాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. బాలీవుడ్ టు టాలీవుడ్.. టాలీవుడ్ టు బాలీవుడ్ వెళ్ళిన ఈ అమ్మడు సక్సెస్ కోసం తపిస్తుంది. అందుకే.. ఇలా చేస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇంతకీ.. ఈ బుట్టబొమ్మ ఏం చేస్తుంది..?
Pooja | తొలి ప్రయత్నంలోనే..

పూజా హేగ్డే.. ఒక లైలా కోసం అంటూ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అక్కినేని నాగచైతన్యకు జంటగా నటించిన పూజా ఈ సినిమాతో సక్సెస్ సాధించడమే కాదు.. ఈ అందాల బొమ్మ ఏ పాత్రలో అయినా మెప్పించగలదు అనిపించింది. ఆతర్వాత నటించిన ముకుంద సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ కు జంటగా నటించి మెప్పించింది. ఇలా కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలోనే వరుసగా రెండు సక్సెస్ లు సాధించడంతో ఇంకేముంది స్పీడు పెంచుతుంది అనుకుంటే.. టాలీవుడ్ లో సరైన ఆఫర్స్ రాలేదని బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంది. మొహంజదారో అంటూ బాలీవుడ్ మూవీ చేసింది. అయితే.. ఆ సినిమా అంతగా ఆడలేదు.
Pooja | కుర్రాళ్లకు కిక్ ఇచ్చిన జిగేల్ రాణి..

టాలీవుడ్ లో ఆఫర్స్ లేకా.. బాలీవుడ్ లో ఆఫర్స్ లేకా.. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న టైమ్ లో.. హరీష్ శంకర్ రూపంలో అదృష్టం పూజా తలుపుతట్టింది. డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో అల్లు అర్జున్ కు జంటగా నటించే ఛాన్స్ ఇచ్చాడు హరీష్ శంకర్. ఇక అక్కడ నుంచి పూజా వరుసగా స్టార్ హీరోల సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ కాంబోలో రూపొందిన రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి అంటూ ఐటం సాంగ్ లో మెరిసింది. ఆ సాంగ్ బాగా పాపులర్ అయ్యింది.. అమ్మడుకు ఎంత పేరు తీసుకువచ్చింది.
Pooja | అదరగొట్టిన బుట్టబొమ్మ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అరవింద్ సమేత, సూపర్ స్టార్ మహేష్ తో మహర్షి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాధేశ్యామ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఆచార్య, మెగా హీరో వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అల.. వైకుంఠపురములో, అక్కినేని అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రాల్లో నటించింది. అలాగే ఎఫ్ 3 సినిమాలో స్పెషల్ సాంగ్ లో అదరగొట్టింది. అల.. వైకుంఠపురములో బుట్టబొమ్మ పాటతో విశేషంగా ఆకట్టుకుని.. మరింతగా పాపులర్ అయ్యింది. ఇలా పూజా వరుస ఆఫర్స్ తో బిజీ అయ్యింది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించాలంటే.. పూజానే గుర్తొచ్చేది. అలాంటిది సినిమా ఛాన్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది.
Pooja | పూజా ఆశలు.. ఆ సినిమా పైనే..

పూజా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళుతుంది. అయితే.. టైమ్ ఏమీ బాలేదు. ఏ సినిమా చేసినా ఫ్లాప్ అవుతుంది కానీ.. సక్సెస్ మాత్రం రావడం లేదు. ఇటీవల కాలంలో కిసికా భాయ్ కిసికీ జాన్ సినిమాలో నటించింది. ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. ఇది ప్లాప్ అయ్యింది. దేవ్, రెట్రో, కూలీ… ఇలా ఏ సినిమా చేసినా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడుతున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ విజయ్ ఆఖరి సినిమా జన నాయగన్ మూవీలో నటించింది. అలాగే కాంచన 4లో కూడా నటిస్తుంది. ఈ రెండు సినిమాల పైనే ఆశలు పెట్టుకుంది. అయితే.. సినిమాల్లో ఛాన్సులు కోసం.. దర్శకనిర్మాతలకు టచ్ లోకి వెళ్లడం.. స్పెషల్ గా ఫోటో షూట్ చేయించి ఆ ఫోటోలను రిలీజ్ చేయడం.. ఇలా మళ్లీ బిజీ కావడానికి.. ఫామ్ లోకి రావడానికి.. తన వంతు ప్రయత్నం చేస్తుంది. మరి.. పూజా జన నాయగన్ మూవీతో మళ్లీ ఫామ్ లోకి వస్తుందేమో చూడాలి.
CLICK HERE TO READ ‘శంబాల’ పుత్రోత్సాహం అందించేనా..?
పూజా హేగ్డే అంటే.. గుర్తుకురాకపోవచ్చు.. కానీ.. బుట్టబొమ్మ అంటే మాత్రం ఠక్కున గుర్తొస్తుంది. అంతలా.. జనాల్లో బాగా పాపులర్ అయ్యింది. అయితే.. ఈ అమ్మడు అందం, అభినయంతో ఆకట్టుకుని అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ నెంబర్ 1 హీరోయిన్ అయ్యింది. ఇప్పుడు టైమ్ మారింది.. ఈ బ్యూటీ సినిమాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. బాలీవుడ్ టు టాలీవుడ్.. టాలీవుడ్ టు బాలీవుడ్ వెళ్ళిన ఈ అమ్మడు సక్సెస్ కోసం తపిస్తుంది. అందుకే.. ఇలా చేస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇంతకీ.. ఈ బుట్టబొమ్మ ఏం చేస్తుంది..?