పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి..

పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి..

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : పాలిటెక్నిక్ కోర్సులలో ప్రవేశానికి పాలిసెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉరవకొండ పాలిటెక్నిక్ పాలీసెట్ కోఆర్డినేటర్ అశ్రీఫ్ అలీ తెలిపారు. ఈనెల 25 వ తేదీన నిర్వహించే పరీక్షకు మొత్తం 503 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కమిషనర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్టర్ నారాయణ భారత్ గుప్త అనుమతి మేరకు ఉరవకొండ పట్టణంలో మొదటిసారిగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు 2 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామని, విద్యార్థులు ఉదయం 9 గంటల లోపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఒక నిమిషం ఆలస్యమైన పరీక్షకు ఆనమతించమన్నారు. ప్రతి విద్యార్ధి హాల్ టికెట్, హెచ్ బి లేదా 2 బి పెన్సిల్, బాల్ పాయింట్ పెన్ ( బ్లూ లేదా బ్లాకు ) తీసుకొని రావాలన్నారు.

హాల్ టికెట్స్ పొందని విద్యార్థులు https://polycetap.ap.gov.in వెబ్ సైట్ నందు లభిస్తాయని తెలిపారు. పరీక్ష సెంటర్స్ ను హాల్ టికెట్స్ ప్రకారం తెలపడం జరిగినది. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ లో హాల్ టికెట్లు నంబర్స్ 5991001 నుండి 5991240, ఎస్.కె గవర్నమెంట్ హై స్కూల్ ఉరవకొండలో హాల్ టికెట్ నంబర్స్ 6001001 నుండి 6001263 కేటాయించడం జరిగిందన్నారు.

Leave a Reply