PBKS vs RCB Qualifier-1 | ఆర్సీబీ ఆన్ ఫైయ‌ర్.. 101కే పంజాబ్ ఆలౌట్ !

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ లో భాగంగా ఈరోజు జ‌రుగుతున్న మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు విజృంభించింది. తొలి ఐపీఎల్ ట్రోఫీ కోసం వేట మొద‌లు పెట్టిన‌ ఆర్సీబీ… పంజాబ్ పై పంజా విసిరింది.

క్వాలిఫ‌య‌ర్ – 1 లో టాస్ గెలిచి పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన బెంగళూరు… బౌలింగ్ లో నిప్పులు చెరిగింది. పంజాబ్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించిన బెంగ‌ళూరు బౌల‌ర్లు.. అద్భుత ప్రదర్శనతో 101 ప‌రుగుల‌కే పంజాబ్ ను ఆలౌట్ చేశారు.

బెంగళూరు స్పిన్నర్ సుయాష్ శర్మ, పేసర్ జోష్ హాజిల్‌వుడ్ చెరో మూడు వికెట్లు తీసి పంజాబ్ బ్యాటింగ్‌ను దెబ్బతీశారు. యశ్ దయాల్ రెండు వికెట్లు తీసుకోగా, భువనేశ్వర్ కుమార్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

ఇక దీంతో 102 ప‌రుగులు ల‌క్ష్యంతో ఆర్సీబీ ఛేజింగ్ కు దిగునంది.

Leave a Reply